మందుబాటిళ్ల మీద యోగా.. దేవతాఫోజు పెట్టబోయి...

By AN TeluguFirst Published Jun 28, 2021, 10:08 AM IST
Highlights

బార్ టేబుల్ మీద కొంచెం ఎత్తులో రెండు మందు బాటిళ్ల మీద కాళ్లు పెట్టి... చాలా కష్టమైన ఫోజుకోసం ట్రై చేసింది. 

యోగా.. ఆరోగ్యంగా ఉండడానికి, ఫిట్ గా ఉండడానికి ఓ మంచి వ్యాయామమార్గం. చాలామంది సెలబ్రిటీలో ఇప్పుడు యోగా బాట పడుతున్నారు. ముఖ్యంగా రకరకాల ఆసనాలతో ఇంటర్నెట్ అటెన్షన్ కొట్టేయడానికి, తద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోవడానికి ట్రై చేసే వారికీ కొదవలేదు.

ఇక సెలబ్రిటీలైతే తమ తీరైన మేనికి యోగానే అంటూ.. రకరకాల భంగిమల్లో యోగా ఫోజులు సోషల్ మీడియాలో పోస్ట చేస్తూ తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇలాగే ఓ యువతి సడెన్ స్టార్ అవుదామనుకుంది.. కానీ బొక్కాబోర్లా పడింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

అయితే.. పాపం ఫేమ్ కావడం కోసం చాలా ప్రమాదకరమైన ఫీట్ నే ఎంచుకుంది ఈ యువతి. బార్ టేబుల్ మీద కొంచెం ఎత్తులో రెండు మందు బాటిళ్ల మీద కాళ్లు పెట్టి... చాలా కష్టమైన ఫోజుకోసం ట్రై చేసింది. బాటిళ్లమీద కాళ్లు పెట్టి, చేతులు దేవతామూర్తుల స్ట్రైల్లో పెట్టి.. ఫోజు ఇవ్వబోయింది. 

కానీ బాలెన్స్ తప్పి... అక్కడ్నుంచి కింద పడిపోయింది. ఇది ఇంతవరకే వీడియోలో కనిపిస్తుంది. అయితే ఆ తరువాత యువతికి ఎలా ఉంది? ఏం జరిగింది? వీడియో ఎక్కడిది? ఎప్పటిది? అనే విషయాలమీద క్లారిటీ లేదు. 

హోల్డ్ మై బీర్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను చాలామంది షేర్ చేస్తున్నారు. అంతేకాదు డోంట్ ట్రై దిస్ అని క్యాప్షన్ తో మరీ షేర్ చేస్తుండడం విశేషం. 

click me!