ఆ రాక్షసుడిని చంపా: బాకోట్‌ శిక్ష తగ్గించిన కోర్టు, విడుదల

By narsimha lodeFirst Published Jun 27, 2021, 11:54 AM IST
Highlights

భర్తను అనివార్య పరిస్థితుల్లోనే చంపాల్సి వచ్చిందని ఆమె చేసిన వాదనతో కోర్టు అంగీకరించింది. అంతేకాదు ఆమె శిక్షను ఏడాదికి తగ్గించింది. అప్పటికే శిక్షా కాలం పూర్తి కావడంతో ఆమెను విడుదల చేసింది కోర్టు.


పారిస్: భర్తను అనివార్య పరిస్థితుల్లోనే చంపాల్సి వచ్చిందని ఆమె చేసిన వాదనతో కోర్టు అంగీకరించింది. అంతేకాదు ఆమె శిక్షను ఏడాదికి తగ్గించింది. అప్పటికే శిక్షా కాలం పూర్తి కావడంతో ఆమెను విడుదల చేసింది కోర్టు.ప్రాన్స్ లోని నలుగురు పిల్లల తల్లి వలేరీ బాకోట్. 1992 లో మగదిక్కు లేని బాకోట్ తల్లికి దగ్గరైన డేనియల్ పొలిట్ట్  దగ్గరయ్యాడు.  ఆ సమయంలో వలేరి వయస్సు 12 ఏళ్లు. 

తల్లితో పాటు ఆమె కూతురు వలేరిని కూడ  డేనియల్ శారీరకంగా ఉపయోగించుకొన్నాడు. దాదాపుగా 25 ఏళ్ల పాటు బాకోట్‌పై  అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమెకు నలుగురు పిల్లలు పుట్టారు. శారీరంగా ఆమెను అనుభవించే సమయంలో  ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు.  ఆమె తిరగబడితే తుపాకీతో బెదిరించేవాడు.  ఆమె పారిపోకుండా జాగ్రత్తలు తీసుకొనేవాడు.

బాకోట్ తో పాటు 14 ఏళ్ల వయస్సున్న ఆమె కూతురును కూడ వేశ్యగా మార్చేందుకు ప్రయత్నించాడు. దీంతో బాకోట్ తట్టుకోలేకపోయింది. 2016లో బాకోట్ డేనియల్ ను ను తుపాకీతో కాల్చి చంపింది.డేనియల్ తోబుట్టువులతో పాటు పిల్లలు కూడ ఆమెకే మద్దతు పలికారు. డేనియల్ ను చంపినట్టుగా ఆమె ఒప్పుకొంది. దీంతో చలోన్ సర్ సావన్ కోర్టు ఆమెకు నాలుగేళ్ల శిక్ష విధించింది. 

ఈ కేసు విచారణ తర్వాత ఆమె బెయిల్ పై విడుదలైంది.  ఈ సమయంలో ఆమె తన ఆత్మకథను రాసింది. టాట్ లే మోండే సవాయిట్ పేరిట ఆత్మకథ రాసింది.ఈ ఆత్మ కథ ఫ్రాన్స్ లో పెను సంచలనంగా మారింది.  ఆమెకు మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు.

నరరూప రాక్షసుడిని చంపిన ఆమెను విడుదల చేయాలని సుమారు 7,10,000 మంది సంతకాలతో ప్రజలు పిటిషన్ ను కోర్టుకు సమర్పించారు.  తాను ఏ పరిస్థితుల్లో డేనియల్ ను చంపాల్సి వచ్చిందో  బాకోట్ కోర్టుకు వివరించింది. డేనియల్ ను చంపకపోతే తనతో పాటు తన పిల్లలను ఇబ్బంది పెట్టేవాడని చెప్పింది. ఒకవేళ తాను  చంపకపోతే తన పిల్లలే డేనియల్ ను చంపేవాడని ఆమె కోర్టుకు చెప్పారు. గతంలో ఆమెకు విధించిన నాలుగేళ్ల శిక్షను ఏడాదికి కుదించింది కోర్టు.  ఆమె ఏడాది పాటు జైలు శిక్ష కూడ పూర్తైంది. దీంతో ఆమెను విడుదల చేసింది కోర్టు.
 

click me!