భార్యను రాళ్లతో కొట్టి హతమార్చిన భర్త.. దారుణానికి సహకరించిన సోదరులు.. కారణమదేనా..?

By Rajesh KarampooriFirst Published Sep 4, 2023, 3:41 AM IST
Highlights

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం ఆరోపణపై ఒక మహిళను రాళ్లతో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేశారు.  లాహోర్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్‌లోని రాజన్‌పూర్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

పాకిస్థాన్‌లో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఆరోపణతో ఓ మహిళను రాళ్లతో చితకబాది హత్య చేశారు. ఓ భర్త తన భార్య (20 ఏళ్లు)మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. ఆ వ్యక్తి తన ఇద్దరు సోదరులతో కలిసి తన భార్యను చెట్టుకు కట్టేసి రాయితో కొట్టి .. హత్య చేశాడు. రాళ్లతో కొట్టడానికి ముందు వారు ఆమెను అత్యంత దారుణంగా హింసించారు.

ఈ హత్య  చేసిన తర్వాత అన్నదమ్ములిద్దరూ పరారీ అయ్యారు. పంజాబ్‌-బలూచిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో వీరు తలదాచుకున్నట్లు సమాచారం. ఈ ఘటన లాహోర్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్‌లోని రాజన్‌పూర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

రాజన్‌పూర్‌లోని అల్కానీ తెగకు చెందిన వివాహిత(20) మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తన భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 1న (శుక్రవారం) ఆ వ్యక్తి తన ఇద్దరు సోదరులతో కలిసి తన భార్య చెట్టుకు కట్టేసి ఆపై రాళ్లతో కొట్టి చంపాడు. రాళ్లు రువ్వే ముందు మహిళను దారుణంగా హింసించారని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడి సోదరులిద్దరూ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పంజాబ్, బలూచిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో వీరు దాక్కున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

పరువు పేరుతో హత్యలు 

పాకిస్థాన్‌లో గౌరవం పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు వారికి హృదయ విదారక శిక్షలు విధిస్తున్నారు.  మరి సార్లు వారికి మరణశిక్ష విధించబడుతుంది. మానవ హక్కుల కార్యకర్తల ప్రకారం.. పాకిస్థాన్‌లో ప్రతి సంవత్సరం 1,000 మంది మహిళలు గౌరవం పేరుతో చంపబడుతున్నారని వెల్లడించారు. ఈ హత్యలు ఎక్కువగా కుటుంబ సభ్యులే చేస్తున్నారని తెలిపారు. బాధితులు తమ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం లేదా సంబంధాలు పెట్టుకోవడం ద్వారా వారి కుటుంబాలకు అవమానం తెచ్చారని దేశంలో విస్తృతంగా నమ్ముతారు. చాలా సందర్భాలలో.. కుటుంబ పరువు పోగొట్టురాని సొంత చెల్లెళ్లను, కూతుళ్లను చంపిన సందర్బాలున్నాయంట.

click me!