అక్కడి యువత పెళ్లి చేసుకోవడం లేదు.. జనాభా సంక్షోభం భయంతో ఆ దేశం ఏం చేసిందంటే?

By Mahesh K  |  First Published Sep 2, 2023, 6:59 PM IST

దక్షిణ కొరియాలో వృద్ధుల జనాభా పెరిగిపోతున్నది. కానీ, యువత జనాభా అందుకు తగినట్టుగా లేదు. పెళ్లి, పిల్లల్ని కనడం తగ్గిపోతున్నది. దీంతో ఆ దేశం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. యువతపై ఒత్తిడి తగ్గించడానికి పిల్లల సంరక్షణ కోసం, ఇంటి పనుల కోసం విదేశీ సహాయకులను నియమించుకోవడానికి అనుమతించాలని నిర్ణయించింది.
 


న్యూఢిల్లీ: చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటం.. అందుకు అనుగుణంగా యువత జనాభా ఉండటం లేదు. దీంతో ఆర్థికంగా ఆ దేశాల్లో శ్రామిక శక్తి తగ్గడమేకాక వారిపై వయోవృద్ధుల భారం పడటం ఆయా దేశాలకు కష్టతరంగా మారాయి. వీటితోపాటు ఇతర ఒత్తిళ్లతో యువత కూడా పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడంపై ఆసక్తి చూపించడం లేదు. 

జనాభాలో ఈ ప్రతికూల మార్పుతో తయారీ, వ్యవసాయ రంగాల్లో కార్మిక కొరత ఏర్పడుతున్నది. ఇది అనేక ఇతర పరోక్ష సమస్యలకు కారణమవుతున్నది. కార్మిక శక్తి తక్కువ ఉండటం మూలంగా ఓసారి పనిగలు వారానికి 52 గంటల నుంచి 69 గంటలకు పెంచింది. కానీ, తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ వెనక్కి తగ్గింది. 

Latest Videos

ఈ జనాభా సంక్షోభ సమస్య ముదరకుండా దక్షిన కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. యువతపై ఒత్తిడి తగ్గించాలనే లక్ష్యంతో ఓ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. పిల్లల సంరక్షణ, ఇంటి పనుల ఒత్తిడి తంగ్గించడానికి విదేశీ సహయాకులను నియమించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే దేశ రాజధాని సియోల్‌లోని ఇళ్లల్లో పని చేయడానికి తొలుత 100 మంది విదేశీ సహాయకులను అనుమతించింది. డిసెంబర్ నాటికి ఇది మొదలు కానుంది. దశలవారీగా దీన్ని పరిశ్రమలు, సంస్థలకూ విస్తరించాలనే యోచనలో ఉన్నది.

Also Read: మరణానంతర జీవితం ఉంటుందా? 5 వేల కంటే ఎక్కువ 'నియ‌ర్ డెత్ అనుభ‌వాల' ప‌రిశోధ‌కుడు ఏం చెప్పారంటే..?

దక్షిణ కొరియా ప్రభుత్వం ఇటీవలే 19 నుంచి 34 ఏళ్లలోపు వారిపై నిర్వహించిన ఓ సర్వేలో సగానిపైగా మంది వివాహం తర్వాత కూడా పిల్లలను కనాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వివాహం పట్ల సానుకూల దృక్పథం ఉన్నదని కేవలం 36.4 శాతం మంది మాత్రమే తెలిపినట్టు ఆ సర్వే పేర్కొనడం గమనార్హం.

click me!