ఇద్దరు చిన్నారుల శవాలతో.. నెలలపాటు కారులో ప్రయాణం..!

Published : Jul 31, 2021, 09:04 AM IST
ఇద్దరు చిన్నారుల శవాలతో.. నెలలపాటు కారులో ప్రయాణం..!

సారాంశం

ఏడేళ్ల మేనకోడలిని చంపేసి.. మృతదేహాన్ని సూట్ కేసులో నింపి.. ఓ ట్రక్కులో పెట్టింది. సంవత్సరం తర్వాత.. ఆ బాలిక మృతదేహం పక్కనే.. బాలుడిని కూడా చంపేసి మరో ప్లాస్టిక్ సంచిలో పెట్టింది.

ఓ మహిళ ఇద్దరు చిన్నారుల శవాలను కారులో పెట్టుకొని కొన్ని నెలలపాటు కారులో తిరుగుతూనే ఉంది. కాగా.. తాజాగా పోలీసులకు చిక్కడంతో... ఆమెను అరెస్టు చేశారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు చెక్ చేస్తుండగా.. నిందితురాలు పోలీసులకు చిక్కడం గమనార్హం. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పు తీర నగరం బాల్టిమోర్ కు చెందిన నికోల్ జాన్సన్(33).. తన ఏడేళ్ల మేనకోడలు, ఐదేళ్ల మేనల్లుడు మరణానికి కారణమైంది. ఏడేళ్ల మేనకోడలిని చంపేసి.. మృతదేహాన్ని సూట్ కేసులో నింపి.. ఓ ట్రక్కులో పెట్టింది. సంవత్సరం తర్వాత.. ఆ బాలిక మృతదేహం పక్కనే.. బాలుడిని కూడా చంపేసి మరో ప్లాస్టిక్ సంచిలో పెట్టింది.

ఇద్దరి శవాలను కారులో తన వెంటే ఉంచుకొని.. సిటీలో తిరుగుతూ ఉంది. అయితే.. ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. ఆమె వద్ద సరైన పేపర్స్ లేవని కారును జప్తు చేశారు. ఈ క్రమంలో కారు చెక్ చేయగా.. ఆమె చేసిన అసలు నేరం భయటపడింది. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు చంపింది అనే విషయం మాత్రం తెలియలేదు. 

PREV
click me!

Recommended Stories

India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..
USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్