ట్యాక్సీ అనుకొని వేరే వాళ్ల కారు ఎక్కిన యువతి.. 120సార్లు పొడిచి..!

Published : Jul 30, 2021, 11:28 AM ISTUpdated : Jul 30, 2021, 11:32 AM IST
ట్యాక్సీ అనుకొని వేరే వాళ్ల కారు ఎక్కిన యువతి.. 120సార్లు పొడిచి..!

సారాంశం

తాను బుక్ చేసుకున్న కారే అనుకొని పొరపాటున వెళ్లి ఎక్కి కూర్చుంది. అంతే.. ఆమెను డ్రైవర్ దాదాపు 120 సార్లు కత్తితో పొడిచి మరీ హత్య చేశాడు

ఆమె ఎక్కడికో వెళ్లాలి... వెంటనే ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. అంతలోనే ఓ కారు వచ్చి ఆమె దగ్గర ఆగింది. అది తాను బుక్ చేసుకున్న కారే అనుకొని పొరపాటున వెళ్లి ఎక్కి కూర్చుంది. అంతే.. ఆమెను డ్రైవర్ దాదాపు 120 సార్లు కత్తితో పొడిచి మరీ హత్య చేశాడు. ఈ సంఘటన వాషింగ్టన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఘటనలో 21ఏళ్ల సమంతా జోసెఫ్సన్ అనే యువతి దుర్మరణం పాలైంది. ఆమెను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో నథానియేల్ రోలాండ్‌ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ అమెరికా కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ ఘోరం 2019లో జరిగింది. సమంతాను హత్య చేసిన అనంతరం ఆమె శరీరాన్ని రోడ్డు పక్కన చెట్లలో పడేసిన రోలాండ్.. తన దారిన తాను వెళ్లిపోయాడు. అతన్ని అరెస్టు చేసిన సమయంలో రోలాండ్ కారులో సమంత రక్తం, మొబైల్ దొరికాయి.

కాగా.. తాజాగా నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ.. శిక్ష విధించింది. అతనికి శిక్ష పడేవరకు సమంతా జోసెఫ్సన్ తల్లి.. చాలా కష్టపడింది. నిందితుడికి శిక్ష పడిన తర్వాత ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే