దారుణం.. మేకపై అత్యాచారం..!

By telugu news teamFirst Published Jul 30, 2021, 10:26 AM IST
Highlights

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ఇప్పుడు చెప్పండి ప్రధాని గారూ. మేకలు కూడా వాటి వస్త్రాధరణ కారణంగానే అత్యాచారానికి గురవుతున్నాయి కదా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.  

రోజు రోజుకీ  దేశంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు పసి పిల్లలను, ఆడపిల్లను కామాంధులు వదలడం లేదని మనం అనుకున్నాం. ఇప్పుడు మూగ జీవాలను కూడా వదలడం లేదు. తాజాగా ఓ మేకపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒకారా జిల్లాలోని ఓ కార్మికుడు ఇంటి ముందు ఉన్న కాంపౌండ్‌లోని మేకను అపహరించిన అయిదుగురు వ్యక్తులు దానిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన తర్వాత మేకను చంపేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోవడం స్థానికుల కంటపడింది. ప్రస్తుతం ఈ ఘటన పాకిస్తాన్‌లో చర్చనీయాంశంగా మారింది. అఘాయిత్యాన్ని వ్యతిరేకిస్తూ అనేకమంది సోషల్‌ మీడియాలో నిరసనలు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ఇప్పుడు చెప్పండి ప్రధాని గారూ. మేకలు కూడా వాటి వస్త్రాధరణ కారణంగానే అత్యాచారానికి గురవుతున్నాయి కదా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.  

పాకిస్తానీ నటి మథిర.. మేకపై అఘాయిత్యానికి సంబంధించిన న్యూస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. జంతువులకు కూడా దుస్తులు ధరించడం అవసరం అంటూ సెటైర్లు పేల్చారు. మరొకరు...‘నగ్న జంతువులు కూడా పురుషులపై ప్రభావం చూపుతాయా? ఇప్పుడు మన అందమైన ప్రధాని... మేకలను కూడా పూర్తి దుస్తులు ధరించాలని అడుగుతాడు. ఎందుకంటే చుట్టుపక్కల వారిని చూసి రెచ్చిపోకుండా ఉండేందుకు.. అమాయకులైన పురుషులు రోబోలు కాదు కదా’. అంటూ చురకలంటించారు.

click me!