Omicron: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. గత నెలలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా, అమెరికాలతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాల్లో తన విజృంభణ కొనసాగిస్తున్నది. ఇది మున్ముందు హెల్త్ కేర్ సిస్టమ్‌ను ప్రమాదంలో పడేసే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
Omicron: కరోనా వైరస్ కొత్త వేరియంట్ పంజా విసురుతోంది. దీనిని అత్యంత ప్రమాదకరమైనదిగా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వ్యాప్తి కూడా వేగంగా ఉంది. అయితే, ఇటీవల పలు నివేదికలు ఒమిక్రాన్ ను చాలా ప్రమాదకరమైన వేరియంట్ ఏమికాదనీ, వ్యాప్తి అధికంగా ఉన్నా.. రోగిపై ప్రభావం తక్కువగానే ఉంటుందని పేర్కొన్నాయి. కానీ.. పలు దేశాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఒమిక్రాన్ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరోసారి ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఒమిక్రాన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొంది. దీని విజృంభణ కారణంగా హెల్త్ కేర్ సిస్టమ్ ప్రమాదంలో పడే అవకాశముందని వెల్లడించింది. అలాగే, ఇప్పటికే కరోనా మరింత అధిక ప్రభావాన్ని కలిగివుంది.. ఒమిక్రాన్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ముంచెత్తుతున్నది అని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలోని సగానికి పైగా దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది. ఆయా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి అత్యంత వేగంగా కొనసాగుతున్నది. దీంతో కొత్త కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
Also Read: Coronavirus: దేశంలో కరోనా కల్లోలం.. ముంబయిలో 70 శాతం, ఢిల్లీలో 50 శాతం కేసుల పెరుగుదల
undefined
ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో నిత్యం లక్షకు పైగా కోవిడ్-19 కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు 11 శాతానికి పైగా పెరిగాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చైనా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కొత్త కేసులు గరిష్టంగా పెరుగ్నుతూనే ఉన్నాయి. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌లు తమ దేశాల్లో ఓమిక్రాన్ ఇతర వేరియంట్లపై ఆధిపత్యం చెలాయిస్తూ.. పంజా విసురుతున్నదనీ, ఇతర వేరియంట్ల కేసులు తక్కువగా నమోదవుతున్నాయని ఆ దేశాల నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలనీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ రెండు నుంచి మూడు రోజుల్లోనే రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతున్నదని గణాంకాలు పేర్కొంటున్నాయి.
Also Read: FAIMA:నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ !
బ్రిటన్, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ దేశాల నుంచి అందిన డేటా ప్రకారం ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉంది. ఆస్పత్రిలో చేరే అవసరం తక్కువగానే ఉందని పలు అధ్యయాలు పేర్కొన్నాయి కానీ, ఒమిక్రాన్ తీవ్రతను తెలుసుకోవడానికి మరింత డేటా అవసరముందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఒమిక్రాన్ వృద్ధి అధికంగా ఉండటంతో పెద్ద సంఖ్యలో దీని బారినపడటంతో పాటు ఆస్పత్రిపాలయ్యే పరిస్థితులకు దారి తీస్తుంది. ముఖ్యంగా టీకాలు తీసుకోని సమూహాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దీని కారణంగా ఆరోగ్య వ్యవస్థలతో పాటు ఇతర క్లిష్టమైన సేవలపై తీవ్ర అంతరాయం ఏర్పడే పరిస్థితులు రావచ్చు అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ప్రపంచంలో యూరప్ కరోనా మహమ్మారి హాట్‌స్పాట్‌లలో మళ్లీ ఒకటిగా మారింది. దాదాపు 5.4 మిలియన్ల మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలను కోవిడ్-19 బలిగొంది. ఫ్రాన్స్, బ్రిటన్, గ్రీస్, పోర్చుగల్ దేశాల్లో రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్‌లో గత 24 గంటల్లో దాదాపు 1,80,000 కరోనా కొత్త కేసులు నమోదుకావడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. కరోనా విజృంభణతో ఆయా దేశాల్లో కఠిన ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కొత్త కేసులు పెరుగ్నుతూనే ఉన్నాయి.
Also Read: coronavirus: మరో హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్ కు అనుమతి.. దేశంలో అందుబాటులో ఉన్న టీకాలివే !