అమెరికా కెంటకీలో కాల్పులు ఐదుగురు మృతి, ఆరుగురికి గాయాలు

Published : Apr 10, 2023, 09:03 PM IST
 అమెరికా  కెంటకీలో  కాల్పులు ఐదుగురు  మృతి, ఆరుగురికి గాయాలు

సారాంశం

అమెరికాలోని  కెంటకీలో ఇవాళ  కాల్పులు  చోటు  చేసుకున్నాయి. ఈ ఘటనలో  ఐదుగురు మృతి చెందారు.  మరో  ఆరుగురు  గాయపడ్డారు. 

వాషింగ్టన్:అమెరికాలోని  కెంటకీలోని  లూయిస్ విల్లేలో  సోమవారంనాడు  జరిగిన  కాల్పుల  ఘటనలో  ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు  గాయపడ్డారు. గాయపడినవారిని  సమీపంలోని   ఆసుపత్రికి తరలించి  చికిత్స  అందిస్తున్నారు.   లూ యిస్  విల్లే ప్రాంతంలోని  నేషనల్  బ్యాంకు  వద్ద  కాల్పులు  చోటు  చేసుకున్నాయి. 

కాల్పులకు దిగిన  అనుమానితుడు కూడా  మృతి చెందాడని  పోలీసులు  చెప్పారు. ఈ విషయాన్ని  డిప్యూటీ  పోలీస్  చీఫ్  హంఫ్రీ  మీడియాకు  చెప్పారు. కాల్పులకు దిగిన  అనుమానితుడు ఎలా మరణించారనే విషయమై  ఇంకా తెలియరాలేదని  ఆయన  చెప్పారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !