Victory Day: రష్యా రాయబారికి నిర‌స‌న సెగ‌.. విక్ట‌రీ డే వేడుకల్లో ఎర్ర సిరాతో దాడి

Published : May 10, 2022, 06:31 AM IST
Victory Day: రష్యా రాయబారికి నిర‌స‌న సెగ‌.. విక్ట‌రీ డే వేడుకల్లో ఎర్ర సిరాతో దాడి

సారాంశం

Victory Day: పోలాండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ ఆండ్రీవ్‌పై రెడ్ పెయింట్‌తో దాడి చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన జ్ఞాపకార్థం వార్షిక విక్టరీ డే వేడుకలకు హాజరయ్యేందుకు వెళుతున్న సెర్గీపై ఈ ఎరుపు రంగు పెయింట్ పోసారు. ఇండిపెండెంట్ ప్రకారం, నిరసనకారులు సోవియట్ సైనికుల స్మశానవాటిక ముందు ఆండ్రీవ్‌పై దాడి చేశారు.  

Victory Day: ఉక్రెయిన్ పై రష్యా  భీకర దాడులు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ర‌ష్యా దాడిని విర‌మించుకోవాల‌ని ప్ర‌పంచ‌దేశాలు విజ్ఞ‌ప్తి చేశాయి. అయినా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మాత్రం లెక్క చేయ‌కుండా.. ప్రపంచ దేశాల మాటలను ఏమాత్రం లెక్కచేయకుండా పుతిన్ (Vladimir putin), ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో అగ్ర దేశం అమెరికాతో అనేక ప్ర‌పంచ‌దేశాలు ఉక్రెయిన్ కు అండ‌గా నిలిచాయి. అండ‌గా నిలిచిన దేశాల‌లో పోలాండ్ కూడా ఉక్రెయిన్ కు బాసటగా నిలిచింది. రష్యాను ఎదుర్కొవడానికి అన్ని విధాల సహయం చేస్తుంది. ర‌ష్యా దాడుల్లో ఉక్రెయిన్ ప్రధాన నగరాలు తమ రూపు రేఖలను కొల్పోయాయి. విమానాలు, బాంబులతో లక్షలాది మంది ఉక్రెయిన్ (Ukraine war) ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వ‌ల‌స వెళ్లిపోయారు. 
  
ఇదిలా ఉంటే.. పోలాండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ ఆండ్రీవ్‌కు నిర‌స‌న సెగ త‌గిలింది. నిర‌స‌న కారులు అత‌నిపై రెడ్ పెయింట్‌తో దాడి చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన జ్ఞాపకార్థం వార్షిక విక్టరీ డే వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా..  వేడుకలకు హాజరయ్యేందుకు వెళుతున్న సెర్గీపై  ఎరుపు రంగు పెయింట్ పోసారు.. 

పోలాండ్ లోని రష్య రాయబారి సెర్గీ ఆండ్రివ్ వార్సాలోని సైనికుల స్మశాన వాటికలో నివాళులు అర్పించడానికి వచ్చారు. దీంతో నిరస‌న‌కారులు, స్థానికులు పెద్ద ఎత్తున వ‌చ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్ర‌మంలో  రాయబారి ముఖంపై  రెడ్ క‌ల‌ర్ పెయింట్ ను వేసి.. నిరసన తెలిపారు. గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్త‌న‌ నినాదాలు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో గుమిగూడారు. భద్రత సిబ్బంది, సెర్గీ ఆండ్రివ్ ను అక్కడి నుంచి వేరే చోటకు తీసుక‌వెళ్లారు.

 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే