
కెనడాలోని రిచ్‌మండ్ హిల్‌లోని విష్ణు దేవాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాం ధ్వంసం అయ్యింది. ఈ విషయంలో భారత్ గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నేరపూరిత, ద్వేషపూరిత విధ్వంసక ఈ చర్య కెనడాలోని భారతీయుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘‘రిచ్‌మండ్ హిల్‌లోని విష్ణు దేవాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల మేము బాధపడ్డాం. ఈ నేరపూరిత, ద్వేషపూరిత విధ్వంసక చర్య కెనడాలోని భారతీయ సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది ’’ అని కెనడాలోని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఒట్టావాలోని భారత హైకమిషన్ కూడా ఈ విషయంలో విచారం వ్యక్తం చేసింది. ‘‘ ఇది భారత సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే ద్వేషపూరిత నేరం’’ అని తెలిపింది. ఈ సంఘటన కెనడాలోని భారతీయ సమాజంలో ఆందోళన, అభద్రతాభావానికి దారితీసిందని హైకమిషన్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. ‘‘ మేము కెనడియన్ ప్రభుత్వాన్ని సంప్రదించాం. నేరస్థులను త్వరితగతిన న్యాయస్థానంలోకి తీసుకురావాలని కోరాము’’ అని పేర్కొంది.
కదులుతున్న కారులో యువతిపై అత్యాచారయత్నం... తప్పించుకోవడానికి కిందికి దూకిన యువతి.. తీవ్రగాయాలతో....
ఈ ఘటనను ఏ రూపంలోనూ సహించం.. యార్క్ ప్రాంతీయ పోలీసులు
ఈ ఘటనపై స్థానిక మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. ఆ ప్రాంతంలోని హిందూ దేవాలయంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆ సమయంలో అవమానకరమైన పదాలు, వ్యాఖ్యలు ఉపయోగించారని CBC నివేదించింది. అయితే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.15 గంటలకు పోలీసు బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
ఈ సంఘటనను ‘‘ ద్వేషపూరిత పక్షపాతంతో ప్రేరేపించబడిన సంఘటన’’ గా ప్రస్తావించారు. యార్క్ ప్రాంతీయ పోలీసు ప్రతినిధి CBCతో మాట్లాడుతూ ‘‘ ఏ రూపంలోనూ ద్వేషపూరిత నేరాలను పోలీసులు సహించరు. జాతి, జాతీయత, జాతి మూలం, భాష, రంగు, మతం, వయస్సు, లింగం, లింగ గుర్తింపు, లింగ వ్యక్తీకరణ వంటి వాటి ఆధారంగా ఇతరులను బలిపశువులను చేసేవారు చట్టం ద్వారా పూర్తిగా విచారణకు గురవుతారు’’ అని ఆయన మీడియాకు తెలిపారు.