భారతీయులకు ఊరట: వీసాల గడువు పొడిగింపుకు అమెరికా అంగీకారం

Published : Apr 14, 2020, 06:22 PM IST
భారతీయులకు ఊరట:  వీసాల గడువు పొడిగింపుకు అమెరికా అంగీకారం

సారాంశం

రోనా మహమ్మారి కారణంగా అమెరికాలో చిక్కుకున్న భారతీయులకు వీసా పొడిగించాలని వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని  అమెరికా హోం ల్యాండడ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. అ మేరకు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. 

వాషింగ్టన్:కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో చిక్కుకున్న భారతీయులకు వీసా పొడిగించాలని వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని  అమెరికా హోం ల్యాండడ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. అ మేరకు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సిఐఎస్) ఈ మేరకు సోమవారం నాడు తన వెబ్ సైట్ లో ఈ విషయాన్ని ప్రకటించింది. వీసాల పొడిగింపు అభ్యర్థన విషయమై వచ్చే ధరఖాస్తులను  వేగంగా పరిష్కరిస్తామని ప్రకటించింది.

గత వారంలో కేంద్ర ప్రభుత్వం అమెరికాలో ఉన్న ఇండియన్ల వీసాలను హెచ్ 1 బీ వీసాల గడువును పొడిగించాలని కోరింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

భారత విదేశాంగ కార్యదర్శి హరీష్ ష్రియాంగ్లా  యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టీఫెన్ బిగేన్ తో ఈ నెల 8వ తేదీన  ఫోన్లో చర్చించారు.  వీసాల విషయంతో పాటు అత్యవసర మందుల విషయమై కూడ చర్చించారు.వీసాల పొడిగించేందుకు అమెరికా సానుకూలంగా స్పందించడం అమెరికాలో ఉన్న ఇండియన్లకు ఇబ్బంది లేకుండా పోయాయి.

ఏ రకమైన వీసాలనైనా పొడిగించేందుకైనా ఇండియా చేసిన వినతిపై అమెరికా సానుకూలంగా స్పందించింది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడ అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగింపు లేదా స్టేటస్ మార్పు కోసం ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

also read:కరోనా కట్టడికి వ్యాక్సిన్: రెండో దశ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న చైనా

హెచ్ 1 బీ వీసా దారులు ఉద్యోగాలు కోల్పోతే  అమెరికాలో గడువును 60 రోజుల నుండి ఎనిమిది మాసాల వరకు పొడిగించినట్టుగా అమెరికా ప్రకటించింది.హెచ్  1 బీ వీసా పరిమితిని  తాత్కాలికంగా 60 రోజుల నుండి 180 రోజులకు పెంచాలని వచ్చిన వినతి మేరకు అమెరికా ఈ నిర్ణయం తీసుకొంది.
 

PREV
click me!

Recommended Stories

Balochistan: పాకిస్థాన్‌కు బిగ్ షాక్‌.. ఇడుపు కాయితం ప్ర‌క‌టించుకున్న కీలక ప్రావిన్స్
USA: అమెరికాలో సంవత్సరానికి రెండుసార్లు టైం ఎందుకు మార్చుతున్నారు? అసలీ టైం గోల ఏంటీ?