కరోనా లాక్ డౌన్.. అక్కడ పెరిగిన దొంగతనాలు

By telugu news team  |  First Published Apr 14, 2020, 1:49 PM IST
దక్షిణాఫ్రికాలో మాత్రం లాక్ డౌన్ వేళ దొంగతనాలు పెరగడం గమనార్హం. అక్కడి స్కూల్స్, మద్యం దుకాణాలు దోపిడీకి గురౌతున్నాయి. గత నెల 27న లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 183 స్కూల్లల్లో దొంగతనాలు జరిగాయని అక్కడి అధికారులు  చెప్పారు.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కాస్త నేరాలు తగ్గాయి. సాధారణంగా ఈ సమయంలో ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండేవి. అయితే.. లాక్ డౌన్ కారణంగా ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉండిపోవడంతో  దొంగతనాలు తగ్గాయి.

అయితే.. దక్షిణాఫ్రికాలో మాత్రం లాక్ డౌన్ వేళ దొంగతనాలు పెరగడం గమనార్హం. అక్కడి స్కూల్స్, మద్యం దుకాణాలు దోపిడీకి గురౌతున్నాయి. గత నెల 27న లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 183 స్కూల్లల్లో దొంగతనాలు జరిగాయని అక్కడి అధికారులు  చెప్పారు.

కాగా.. దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ ని కొనసాగిస్తూ.. అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

డ్రగ్స్, మద్యం కోసమే దుండగులు పాఠశాలల్లో దొంగతనాలు చేస్తున్నారని.. అక్కడి అధికారులు చెబుతున్నారు. పిల్లలు చదువుకునే పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని వారు చెబుతున్నారు.
click me!