కరోనా కట్టడికి వ్యాక్సిన్: రెండో దశ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న చైనా

Published : Apr 14, 2020, 01:09 PM IST
కరోనా కట్టడికి వ్యాక్సిన్: రెండో దశ క్లినికల్ ట్రయల్స్  చేస్తున్న చైనా

సారాంశం

కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి వ్యాక్సిన్ లేకపోవడం ప్రధాన కారణంగా  నిపుణులు చెబుతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకుగాను  చైనా మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్ తయారీలో భాగంగా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టింది చైనా.  

బీజింగ్: కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి వ్యాక్సిన్ లేకపోవడం ప్రధాన కారణంగా  నిపుణులు చెబుతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకుగాను  చైనా మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్ తయారీలో భాగంగా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టింది చైనా.

రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం చైనా 500 మంది వలంటీర్లను నియమించుకొంది. చైనాలోని వుహాన్ పట్టణానికి చెందిన 84 ఏళ్ల వయస్సున్న మహిళను కూడ ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్ తయారు చేసేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయమై  వ్యాక్సిన్ తయారీలో చైనా ముందడుగు వేసింది. మొదటి దశ పరీక్షలను పూర్తి చేసి రెండో దశ పరీక్షలను ప్రారంభించింది.

రెండో దశలో దృష్టి టీకా సమర్ధతపై దృష్టి పెట్టారు. రెండో దశలో మొదటి దశ కంటే ఎక్కువమంది వలంటీర్లు ఉన్నారు. చైనాలోని బయోటెక్నాలజీ అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ టీమ్ ఈ వ్యాక్సిన్ తయారీపై ప్రయోగాలు చేస్తోంది.

ఈ వ్యాక్సిన్ తయారీ కోసం జెనెటిక్ ఇంజనీరింగ్ పద్దతులను ఉపయోగిస్తున్నట్టుగా సమాచారం.టీకా భద్రతపై ఈ రీసెర్చ్ లో ప్రాధాన్యత ఇచ్చారు. రెండో దశలో  టీకా సమర్ధతపై శాస్త్రవేత్తలు కేంద్రీకరించారు.
also read:వ్యాక్సిన్ కనిపెట్టేవరకు కరోనాతో ముప్పే: ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ఈ ఏడాది మార్చిలో చైనా మొదటి దశ ప్రయోగాన్ని నిర్వహించింది. స్వైన్ ఫ్లూ కంటే కరోనా వైరస్ పదిరెట్లు ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి అథనోమ్ సోమవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. 

వ్యాక్సిన్ కనిపెట్టేవరకు ఈ వైరస్  ప్రమాదకరమైందేనని ఆయన  తేల్చి చెప్పారు.కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,15,000 మంది మృతి చెందారు. సుమారు 1.8 మిలియన్ల మందికి ఈ వైరస్ సోకింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే