అమెరికాలో జాత్యహంకార దాడి.. 18యేళ్ల ఆసియా విద్యార్థిపై కత్తితో దాడి చేసిన మహిళ...

By SumaBala BukkaFirst Published Jan 17, 2023, 10:38 AM IST
Highlights

అమెరికాలో ఓ మహిళ ఆసియన్ అనే కారణంతో ఓ విద్యార్థిని మీద దాడికి పాల్పడింది. దాడికి ముందు ఇద్దరు మహిళల మధ్య ఎటువంటి పరిచయం, సంభాషణ, గొడవ జరగలేదు. 

అమెరికా : యూఎస్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. జాత్యహంకారం ఓ టీనేజ్ అమ్మాయి ప్రాణం తీసింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, బాధితురాలు ఆసియన్ అయినందుకే 56 ఏళ్ల మహిళ ఆమె మీద దాడి చేసింది. 18 ఏళ్ల ఇండియానా యూనివర్సిటీ విద్యార్థినిని బస్సులో తలపై పలుసార్లు కత్తితో పొడిచింది బిల్లీ డేవిస్ అనే 56 యేళ్ల మహిళ. 

తన జాతి కోసమే విద్యార్థిని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపింది. డబ్ల్యూఆర్టీవీ దగ్గరున్న కోర్టు పత్రాల ప్రకారం, 18 ఏళ్ల విద్యార్థిని కత్తితో పొడిచిన తరువాత "మన దేశాన్ని పేల్చివేసేందుకు ఒక వ్యక్తి తక్కువయ్యారు" అని మహిళ పోలీసులకు చెప్పింది.

బాధితురాలు బ్లూమింగ్టన్ ట్రాన్సిట్ బస్సులో ప్రయాణిస్తుంది. బస్సులో ఎగ్జిట్ డోర్లు తెరవడానికి నిలబడి ఎదురుచూస్తుండగా, మరో ప్రయాణికురాలు ఆమె తలపై కొట్టడం ప్రారంభించినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, దాడికి ముందు ఇద్దరు మహిళల మధ్య ఎటువంటి గొడవ జరగలేదు. ఆ విద్యార్థిని తల మీద ఏడు కత్తిపోట్లను కనుగొన్నారు. 

అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఒక్కే ఇంట్లో ఆరుగురు మృతి..

ఇది జాతి విద్వేషపూరిత దాడి అని పోలీసుల విచారణలో తేలింది. దాడి కోసం నిందితురాలు మడత కత్తిని ఉపయోగించినట్లు అంగీకరించింది. నిందితురాలిని పోలీసులు గురువారం మళ్లీ విచారించారు. ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే, ఆమెపై దీనితోపాటు కూడా ద్వేషపూరిత దాడి.. అభియోగాలు కూడా పెట్టే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలున్నాయి. 

ఈ దాడి పూర్తిగా అకారణంగా జరిగిందని పోలీసులు తెలిపారు. విద్యార్థి ఎగ్జిట్ తలుపులు తెరిచే వరకు వేచి ఉన్న డేవిస్ ఆకస్మికంగా ఆమె మీద దాడి చేసిందని పోలీసులు ఆరోపించారు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దాడితరువాత ఆమె పారిపోతుంటే ఓ వ్యక్తి ఆమె వెంటపడ్డాడు. తద్వారా ఆమెను పోలీసులకు పట్టించడంలో సాయం చేశాడు. 

ఇండియానా యూనివర్శిటీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ డైవర్సిటీ, ఈక్విటీ అండ్ మల్టికల్చరల్ అఫైర్స్ జేమ్స్ వింబుష్ ఈ ఘటన మీద ఒక ప్రకటనలో ఇలా అన్నారు.. "ఆసియన్ వ్యతిరేక ద్వేషం నిజమని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఇది సమాజం మీద, వ్యక్తుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది నిజంగా బాధాకరమైనది’’ అని అన్నారు. 

"ఎవ్వరూ వారి నేపథ్యం, ​​జాతి లేదా వారసత్వం కారణంగా వేధింపులు లేదా హింసను ఎదుర్కోకూడదు. అందుకే, మా క్యాంపస్, కమ్యూనిటీ సంస్కృతిని రూపొందించే విస్తారమైన గుర్తింపులు, దృక్కోణాల కారణంగా బ్లూమింగ్టన్, ఐయు కమ్యూనిటీలు బలంగా ఉన్నాయి" అన్నారు. 

click me!