నేపాల్ విమాన ప్రమాదంలో ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు - నేపాల్ ఆర్మీ ప్రకటన.. మృతుల్లో ఐదుగురు భారతీయులు

Published : Jan 16, 2023, 09:45 AM IST
నేపాల్ విమాన ప్రమాదంలో ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు - నేపాల్ ఆర్మీ ప్రకటన.. మృతుల్లో ఐదుగురు భారతీయులు

సారాంశం

నేపాల్ విమాన్ ప్రమాదం నుంచి ఒక్కరినీ సజీవంగా రక్షించలేకపోయామని ఆ దేశ ఆర్మీ సోమవారం ప్రకటించింది. విమానంలో మొత్తం 72 మంది చనిపోయారని తెలిపింది. ఈ విమాన ప్రమాదంలో ఐదుగురు భారతీయులు కూడా మరణించారు. 

నేపాల్ లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం జరిగింది. ఇందులో ప్రయాణిస్తున్న 72 మందిలో ఒక్కరినీ సజీవంగా రక్షించలేదని నేపాల్ ఆర్మీ సోమవారం తెలిపింది. ‘‘ సెంట్రల్ రిసార్ట్ సిటీ పోఖారాలో ఆదివారం కూలిన విమానంలో నుంచి తాము ఎవరినీ సజీవంగా రక్షించలేదు’’ అని నేపాల్ ఆర్మీ ప్రతినిధి కృష్ణ ప్రసాద్ భండారీ ప్రకటించారు. 

ఇండోనేషియాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రత నమోదు..

నేపాల్‌లోని పోఖారాలో ఇటీవలే ప్రారంభించిన విమానాశ్రయంలో ఏటి ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం ల్యాండ్ చేస్తున్నప్పుడు నదిలో కూలిపోయింది. అయితే ఈ విమానంలో ఉన్న ఐదుగురు భారతీయులతో పాటు 72 మంది చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. నేపాలీ రాజధాని ఖాట్మండు నుంచి ట్విన్ ఇంజిన్లతో కూడిన టర్బోప్రాప్ ఏటీఆర్ విమానం బయలుదేరింది. 

ఢిల్లీలో షాకింగ్.. వ్యక్తిని చంపి,శరీరాన్ని మూడు ముక్కలుగా కోసి..వీడియో తీసి, పాకిస్థాన్ కు...

కాగా.. ఈ విమాన ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ మంత్రి మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు స్పెషల్ కమిషన్ ను నియమించారు. ఇది 45 రోజుల్లో నివేదికను అందజేయనుంది. నేపాల్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలుపుతూ ప్రార్థించారు. ‘‘ నేపాల్‌లో జరిగిన విషాద విమాన ప్రమాదంలో భారతీయ పౌరులతో పాటు ఇతరులు విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి ’’ అని మోడీ ట్వీట్ చేశారు. 

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు సంతాపం తెలిపారు. ‘‘నేపాల్‌లోని పోఖారాలో జరిగిన విమాన ప్రమాదం విషయం తెలిసి చాలా బాధపడ్డాను. మా ఆలోచనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి’’ అని ఆయన ట్వీట్ చేశారు. నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. విమానంలో ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఒక ఐరిష్ జాతీయుడుతో పాటు 68 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపింది. 

ఇప్పుడు ప్రమాదం చోటు చేసుకున్న విమానాశ్రయం చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సహకారంలో భాగంగా నిర్మితమైంది. ఖాట్మండు పోస్ట్ వార్తాపత్రిక ప్రకారం.. ఈ టూరిస్ట్ హబ్‌లో విమానాశ్రయం నిర్మాణం కోసం నేపాల్ ప్రభుత్వం 2016లో మార్చి చైనాతో 215.96 మిలియన్ డాలర్ల సాఫ్ట్ లోన్ ఒప్పందంపై సంతకం చేసింది. గత ఏడాది చైనా మాజీ విదేశాంగ మంత్రి వాంగ్ యి.. బలువతార్‌లో జరిగిన మర్యాదపూర్వక భేటీలో అప్పటి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాకు పోఖారా ప్రాంతీయ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అప్పగించారు. సహజమైన అన్నపూర్ణ పర్వత శ్రేణి నేపథ్యంలో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ 2023 జనవరి 1న అధికారికంగా ప్రారంభించారు.
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే