విమానంలో మహిళలను అసభ్యంగా తాకుతూ..

Published : Aug 07, 2021, 07:38 AM ISTUpdated : Aug 07, 2021, 07:45 AM IST
విమానంలో మహిళలను అసభ్యంగా తాకుతూ..

సారాంశం

తాకరాని చోట తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. తోటి ప్రయాణికులతో మాటల యుద్ధానికి దిగాడు. ఇదేంటని ప్రశ్నించిన సిబ్బందిపై దాడికి దిగాడు.  

విమానంలో ఓ వ్యక్తి.. సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో.. అతనికి విమాన సిబ్బంది తగిన శాస్తి చేశారు. అతనిని కూర్చున్న సీట్లోనే కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేశారు.  విమానం ల్యాండ్ అయిన తర్వాత  పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఫిలడెల్ఫియా లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళుతున్న విమానంలో మాక్స్ వెల్ బెర్రీ(22) అనే అమెరికా యువకుడు మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. తోటి ప్రయాణికులతో మాటల యుద్ధానికి దిగాడు. ఇదేంటని ప్రశ్నించిన సిబ్బందిపై దాడికి దిగాడు.

దీంతో విసుగు చెందిన విమాన సిబ్బంది సదరు యువకుడిని పట్టుకొని.. అతను కూర్చున్న సీట్లోనే అతడిని టేపుతో కట్టేశారు.  నోట్లో నుంచి మాట బయటకు రాకుండా.. నోటికి కూడా టేప్ చుట్టేశారు. ఆ యువకుడిని కట్టేస్తుంటే.. తోటి ప్రయాణికులంతా నవ్వుతూ ఆనందం వ్యక్తం చేశారంటే.. అతను ఎంతలా బీభత్సం సృష్టించాడో మీకే అర్థమౌతుంది.

 ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోలను చూసి.. మంచి పనిచేశారంటూ విమాన సిబ్బందిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !