మద్యం బాటిల్ కనిపించడం లేదు.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. ఎక్కడంటే...

By AN TeluguFirst Published Aug 6, 2021, 4:37 PM IST
Highlights

మద్యం బాటిల్ కనిపించకుండా పోవడాన్ని అమెరికా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో దర్యాప్తుకు ఆదేశించింది. వినడానికి విచిత్రంగా ఉన్నా, ఇది నిజం, పూర్తి వివరాల్లోకి వెడితే ఒక దేశానికి చెందిన మంత్రులు లేదా ఉన్నతాధికారులు ఇతర దేశాల్లో పర్యటిస్తారనే విషయం తెలిసిందే.

అమెరికాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ మద్యం బాటిల్ కనిపించడం లేదని ఏకంగా అగ్రరాజ్యమే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మరి అంత ముఖ్యమైన మద్యం బాటిల్ కథేంటో చదవండి.. 

మద్యం బాటిల్ కనిపించకుండా పోవడాన్ని అమెరికా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో దర్యాప్తుకు ఆదేశించింది. వినడానికి విచిత్రంగా ఉన్నా, ఇది నిజం, పూర్తి వివరాల్లోకి వెడితే ఒక దేశానికి చెందిన మంత్రులు లేదా ఉన్నతాధికారులు ఇతర దేశాల్లో పర్యటిస్తారనే విషయం తెలిసిందే.

విదేశీ పర్యటనలో ఉన్న మంత్రులు లేదా ఉన్నతాధికారులకు అక్కడి అదికారులు లేదా మంత్రులు రకరకాల బహుమతులు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న మైక్ పాంపియోకు విదేశీ పర్యటన సందర్భంగా జపాన్ ప్రభుత్వ అధికారులు 5800 డాలర్లు (సుమారు రూ.4 లక్షలు) విలువ చేసే ఓ మద్యం బాటిల్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. 

ప్రస్తుతం ఆ మద్యం బాటిల్ కనిపించకుండా పోయింది. దీంతో అమెరికా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉంటే.. జపాన్ ప్రభుత్వ అధికారులు మద్యం బాటిల్ ను గిఫ్ట్ గా ఇచ్చిన సమయంలో మైక్ పాంపియో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారని, ఆ వైన్ సీసాను అతను నేరుగా తీసుకున్నారా? లేదా అనే విషయం మీద స్పష్టత లేదని అమెరికాకు చెందిన ఓ వార్తా పత్రిక తన కథనంలో పేర్కొంది. 

కాగా, 390 డాలర్ల కంటే తక్కువ విలువ చేసే బహుమతులను తీసుకున్నప్పుడు అమెరికాలో ఎటువంటి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అంతకుమించి విలువైన వస్తువును బహుమతిగా తీసుకుంటే మాత్రం అక్కడి చట్టాల ప్రకారం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం ఆ మద్యం బాటిల్ కు డబ్బులు చెల్లించినట్టు ఎక్కడా పేర్కొనలేదు. దీనికి తోడు ప్రస్తుతం ఆ వైన్ బాటిల్ కూడా కనిపించకపోవడంతో అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  

click me!