కరోనా ఎఫెక్ట్.. హెచ్1 బీ వీసాలపై తాత్కాలిక నిషేధం..?

By telugu news team  |  First Published May 9, 2020, 9:59 AM IST

ఈ వైరస్ ప్రభావం హెచ్1 బీ వీసాపై కూడా పడింది. హెచ్ 1 బీ వీసాలను కొంత కాలంపాటు నిషేధించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
 


కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగానే ఉంది. దీని కారణంగా పలు దేశాల్లో నిరుద్యోగం పెరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. తాజాగా.. ఈ వైరస్ ప్రభావం హెచ్1 బీ వీసాపై కూడా పడింది. హెచ్ 1 బీ వీసాలను కొంత కాలంపాటు నిషేధించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా అయిన హెచ్ -1 బి.. సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ కార్మికులను నియమించుకోవడానికి యుఎస్ లోని కంపెనీలను అనుమతిస్తుంది. H-1B వీసా హోదాలో US లో 500,000 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు.

Latest Videos

"అధ్యక్షుడి ఇమ్మిగ్రేషన్ సలహాదారులు రాబోయే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు, ఈ నెలలో, కొన్ని కొత్త తాత్కాలిక, పని ఆధారిత వీసాల జారీని నిషేధించే అవకాశం ఉంది" అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

హెచ్1 బీ, హెచ్ 2 బీ, స్టూడెంట్ వీసాలపై కూడా అమెరికా ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా...అమెరికాలో గల అత్యధిక టెక్ దిగ్గజాలు, ఇతర సంస్థలు.. హెచ్2 బీ వీసాదారులకు మార్కెట్‌లో సాధారణ వేతనాలతో పోలిస్తే తక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు తేలింది. టెక్నాలజీ, సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, ఫేస్‌బుక్ సైతం ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయని తెలిపింది.

‘హెచ్-2బీ వీసాస్ అండ్ ప్రివెయిలింగ్ వేజ్ లెవెల్స్’ పేరిట ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశం వెల్లడయ్యాయి. హెచ్-1 బీ వీసాదారుల్లో 60 శాతం మంది స్థానిక మధ్యస్థ వేతనం (లోకల్ మీడియన్ వేజ్) కంటే తక్కువ వేతనం పొందుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. 

దిగ్గజ సంస్థలు కూడా మీడియన్ వేజ్ కంటే తక్కువగా ఉండే లెవెల్-1, లెవెల్-2 వేతనాలే ఇస్తున్నాయని ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ నివేదిక తెలిపింది. దీనికి ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్’ హెచ్-1 బీ వీసా నిబంధనలు సైతం దీనికి అనుమతినిస్తున్నట్లు పేర్కొన్నది.


 

click me!