Nancy Pelosi Taiwan Visit:  డ్రాగ‌న్ హెచ్చ‌రిక‌ల‌ను లెక్క చేయ‌ని అమెరికా .. తైవాన్ లో కాలు పెట్టిన US స్పీకర్.

By Rajesh KFirst Published Aug 3, 2022, 12:06 AM IST
Highlights

Nancy Pelosi Taiwan Visit: చైనా హెచ్చరికను దాటవేస్తూ అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ చేరుకున్నారు. పెలోసీ విమానం తైపీలో ల్యాండ్ అయింది. తీవ్ర పరిణామాలకు అమెరికా సిద్ధంగా ఉండాలని చైనా హెచ్చరించింది.  

US

Nancy Pelosi Taiwan Visit: చైనా హెచ్చరికను దాటవేస్తూ అమెరికా ప్రతినిధుల సభ(హౌస్​ ఆఫ్​ రిప్రసెంటేటివ్స్​) స్పీకర్ నాన్సీ పెలోసీ మంగళవారం రాత్రి తైవాన్ లో అడుగుపెట్టారు. అంత‌ర్జాతీయ  మీడియా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. పెలోసీ విమానం అర్థరాత్రి తైపీలో ల్యాండ్ అయింది. పెలోసీ పర్యటన కారణంగా చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెల‌కొన్నాయి.

ఆమె తైవాన్​కు వస్తే.. అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని  చైనా హెచ్చరించినా.. ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో 25 ఏళ్లకు త‌రువాత‌  తైవాన్‌లో పర్యటించిన అమెరికా అత్యున్నత అధికారిగా స్పీకర్ నాన్సీ పెలోసీ రికార్డు సృష్టించారు.

పెలోసీ పర్యటన నేపథ్యంలో తైవాన్ కూడా భాగమేనని చైనా వాదిస్తోంది.  యూఎస్ స్పీక‌ర్..  తైవాన్ లో ప‌ర్య‌టించ‌డానికి చైనా తీవ్రంగా  వ్యతిరేకించింది. తైవాన్ కూడా చైనా ద్వీప భూభాగాన్ని, త‌మ‌ సార్వభౌమాధికారం ప‌రిధిలోనికి వ‌స్తుంద‌ని డ్రాగ‌న్ దేశం హెచ్చ‌రించింది. 

మ‌రోవైపు.. పెలోసీ పర్యటన నేపథ్యంలో..  తైవాన్ లో చైనా సైనిక విన్యాసాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో అమెరికా కూడా  తమ ఆసియా-పసిఫిక్ కమాండ్‌ను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో.. తైవాన్‌లో యూఎస్ స్పీక‌ర్ పెలోసీ పర్యటన తీవ్ర ఉత్కంఠగా మారింది. 

అదే సమయంలో..అమెరికా డేంజరస్ గేమ్ ఆడుతోందని చైనా విదేశాంగ మంత్రి అన్నారు. అమెరికా వాగ్దానాలు, నమ్మకాన్ని ఉల్లంఘించిందని అన్నారు. ఈ పరిణామాల‌కు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందనీ, తీవ్ర పరిణామాలకు అమెరికా సిద్ధం కావాలని చైనా హెచ్చ‌రించింది.
  
ఈ క్ర‌మంలోనే.. చైనా హెచ్చరికను బేఖాతరు చేస్తూ.. అమెరికా పార్లమెంట్ దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ మలేషియా నుంచి తైవాన్ బయల్దేరి వెళ్లారు. పెలోసి ఈ వారం ఆసియా పర్యటనలో ప‌ర్య‌టించ‌ను్న్నారు. తైవాన్ మీడియా ప్రకారం.. పెలోసి మంగళవారం రాత్రి తైపీ చేరుకున్నారు. అదే సమయంలో, తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయంలో వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.

ప్రధాన మంత్రి సు సీయుంగ్-చాంగ్ కూడా పెలోసి పర్యటనను స్పష్టంగా ధృవీకరించలేదు, అయితే విదేశీ అతిథులు, స్నేహపూర్వక చట్టసభ సభ్యులు ఎవరైనా స్వాగతం పలుకుతారని మంగళవారం చెప్పారు. అదే సమయంలో తైవాన్ రాజధాని తైపీలో ఉన్న గ్రాండ్ హయత్ హోటల్ చుట్టూ బారికేడ్లు వేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. పెలోసి ఈ హోటల్‌లో బస చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఇదిలాఉంటే.. ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కూడా ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై గట్టిగానే హెచ్చరించారు. చైనా హెచ్చరికల నేపథ్యంలో వైట్ హౌట్ కూడా స్పీక‌ర్ పెలోసీని హెచ్చరించింది. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడొచ్చని అమెరికా తెలిపింది. 

 అమెరికా అప్రమత్తం.. 

తైవాన్ తూర్పు వైపు తీరంలో అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలను మోహరించినట్లు రాయిటర్స్‌ వార్తాకథనం వెల్లడించింది. యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగన్‌ క్యారియర్‌ దక్షిణ చైనా సముద్రం స‌మీపంలోని   ఫిలిప్పీన్స్ సముద్రంలోకి చేరుకుందని పేర్కొంది. 
 

click me!