Ayman al-Zawahiri : అల్-జవహిరి తర్వాత, అల్ ఖైదాకు తరువాతి లీడర్ ఇతనేనా?...

By Bukka SumabalaFirst Published Aug 2, 2022, 1:41 PM IST
Highlights

సైఫ్ అల్-అడెల్ ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్ గా పనిచేశాడు. 2001 నుండి FBI మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. ఇప్పుడు అతను అల్ ఖైదా తదుపరి నాయకుడయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 

ఆఫ్ఘనిస్తాన్ :  ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో డ్రోన్ దాడిలో  అల్ ఖైదా నాయకుడు అమాన్ అల్-జవహిరిని యునైటెడ్ స్టేట్స్ హతమార్చింది. ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ 2011లో హత్య తరువాత అల్ ఖైదాకు ఇదే అతిపెద్ద దెబ్బ. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ‘న్యాయం జరిగింది’ అంటూ అతని మరణాన్ని ధృవీకరించారు. శ్వేత సౌధం నుంచి ఇచ్చిన ఓ టెలివిజన్ ప్రసంగంలో అమెరికాకు సెప్టెంబర్ 11, 2001 జరిగిన నష్టానికి జవహిరి మరణం న్యాయం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

9/11 దాడుల్లో యునైటెడ్ స్టేట్స్‌లో మరణించిన 3,000 మంది వ్యక్తుల కుటుంబాలకు ఇది ఊరటనిస్తుందని తెలిపారు. అమెరికా దాడుల్లో మరణించిన ఆల్-ఖైదా నాయకుడు సెప్టెంబర్ 11, 2001 దాడులకు ప్రధాన సూత్రధారి, ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడు. 2011లో బిన్ లాడెన్ హతమైన తర్వాత జవహరి అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్నాడు. కాబట్టి జవహిరి హత్యతో, అల్ ఖైదా తీవ్రమైన వారసత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.

Ayman al-Zawahri : ఎవ‌రీ ఐమన్ అల్-జవహ‌రీ.. ఎందుకు అమెరికా అత‌డిని మ‌ట్టుపెట్టింది ?

మిడిల్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, అల్ ఖైదాకు తరువాత పగ్గాలు చేపట్టే క్రమంలో సైఫ్ అల్-అడెల్ ముందు వరుసలో ఉన్నాడు. ఇతను ఈజిప్టు మాజీ ఆర్మీ అధికారి, అల్ ఖైదా వ్యవస్థాపక సభ్యుడు, US ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం 1980లలో మక్తాబ్ అల్-ఖిద్మత్ ఈ టెర్రర్ గ్రూప్‌లో చేరాడు. ఆ సమయంలోనే అతను బిన్ లాడెన్, ఐమన్ అల్-జవహిరిలను కలుసుకున్నాడు అదే సమయంలో వారి ఈజిప్షియన్ ఇస్లామిక్ జిహాద్ (EIJ) గ్రూప్ లో చేరాడు. 1980లలో ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా దళాలతో కూడా పోరాడాడు.

సైఫ్ అల్-అడెల్ ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్, 2001 నుండి FBI మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. అతని గురించిన సమాచారం కోసం అందించిన వారికి ఇచ్చే రివార్డ్ మొత్తం ఇప్పుడు $10 మిలియన్లకు పెంచబడింది. "యునైటెడ్ స్టేట్స్ పౌరులను చంపడానికి, హత్య చేయడానికి, యునైటెడ్ స్టేట్స్ భవనాలు, ఆస్తులను ధ్వంసం చేయడానికి.. యునైటెడ్ స్టేట్స్ జాతీయ రక్షణ వినియోగాలను నాశనం చేయడానికి" కుట్ర పన్నినట్లు అల్-అడెల్‌ గురించి ఏజెన్సీ పేజీలో పేర్కొంది.

ABC న్యూస్‌లోని ఓ పాత వార్త ప్రకారం, 1993 నుండి US దళాలు సైఫ్ అల్-అడెల్ కోసం వెతుకుతున్నాయి, సోమాలియాలోని మొగడిషులో US దళాల హెలికాప్టర్‌ల మీద దాడి చేసిన "బ్లాక్ హాక్ డౌన్" సంఘటనలో ఇతను ఉన్నాడు. ఈ దాడిలో 18 మంది అమెరికన్లు మరణించారు.  ఆ సమయంలో అల్-అడెల్ వయసు 30 ఏళ్లు. బిన్ లాడెన్ మరణించినప్పటి నుండి, అల్-అడెల్ ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా మారాడని అనేక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే, "బ్లాక్ హాక్ డౌన్" సంఘటన తరువాత అతను ఇరాన్‌లోనే ఉన్నాడు. దీనివల్ల అతనిని టెర్రర్ గ్రూప్‌కు చీఫ్‌గా చేయడం కష్టమైన విషయంగానే ఉంటుందని మిడిల్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఇటీవలి కాలంలో, కనీసం మూడు అల్-ఖైదా అనుబంధ సంస్థలు సైఫ్ అల్-అదెల్ నుండి వస్తున్న సూచనల విశ్వసనీయతను ప్రశ్నించినట్లు కూడా ఇన్స్టిట్యూట్ తెలిపింది.

click me!