మోదీ గొప్ప వ్యక్తి.. అద్భుతంగా పని చేస్తున్నారు: డోనాల్డ్ ట్రంప్ ప్రశంసలు

By Sumanth KanukulaFirst Published Sep 8, 2022, 4:38 PM IST
Highlights

భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి అని.. ఆయన అద్భుతమైన పని చేస్తున్నారని అమెరికా మాజీ  అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. భారతదేశంతో, ప్రధాని మోదీతో నాకు గొప్ప అనుబంధం ఉందని చెప్పారు. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి అని.. ఆయన అద్భుతమైన పని చేస్తున్నారని అమెరికా మాజీ  అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఎన్‌డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో భారతీయ సమాజం నుంచి లభించిన మద్దతు, ప్రధాని మోదీతో ఉన్న సంబంధాల గురించి ట్రంప్ ఈ ఇంటర్క్యూలో మాట్లాడారు. భారతదేశానికి తనకంటే మంచి స్నేహితుడు ఎన్నడూ లేడని చెప్పారు. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ పడవచ్చనే సంకేతాలను ట్రంప్ ఇచ్చారు. 

‘‘ప్రతి ఒక్కరూ నేను పోటీ చేయాలని అనుకుంటున్నారు. నేను ఎన్నికలకు సంబంధించిన అన్ని సర్వేలలో ముందంజలో ఉన్నాను.. సమీప భవిష్యత్తులో నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. అని నేను అనుకుంటున్నాను’’ అని  ట్రంప్ ఆ ఇంటర్క్యూలో తెలిపారు. జో బైడెన్, బరాక్ ఒబామాల కంటే.. భారత్‌తో మంచి సంబంధాలు కలిగి  ఉన్నారా అని ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘‘మీరు ప్రధాని మోదీని అడగాలి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో ఉన్న సంబంధాల కంటే ఎన్నడూ మెరుగైనది ఉందని నేను అనుకోవడం లేదు’’ అని సమాధానం ఇచ్చారు.   

‘‘భారతదేశంతో, ప్రధాని మోదీతో నాకు గొప్ప అనుబంధం ఉంది. మేము స్నేహితులుగా ఉన్నాం. ఆయన గొప్ప వ్యక్తి.. అద్భుతమైన పని చేస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఇది అంతా సులభమైన పని కాదు. మేము ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. ఆయన మంచి మనిషి’’ అని ట్రంప్ చెప్పారు. భారత్‌తో తనకున్న సంబంధాలను తన పదవిలో ఉండగా ఏర్పరచుకున్న బలమైన సంబంధాలలో ఒకటిగా ట్రంప్ అభివర్ణించారు.

ట్రంప్ 2.0, అమెరికా-భారతదేశం ప్రాధాన్యతల గురించి ట్రాంప్ మాట్లాడుతూ.. అమెరికాను ఎనర్జీ ఇండిపెండెంట్‌గా నిలుపుతామని చెప్పారు. భారతదేశం తన స్నేహితుడు, ప్రధాని మోదీ నేతృత్వంలో బాగానే పని చేస్తుందని చెప్పారు. తాను ప్రస్తుతం అమెరికా ప్రాధాన్యతల గురించే మాట్లాడతానని చెప్పారు. ‘‘మేము ఎనర్జీ ఇండిపెండెంట్‌గా ఉండబోతున్నాము, మేము గొప్ప ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాము.. మళ్లీ గర్జించే ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండబోతున్నాం. అయితే ఇది ప్రస్తుతం మాకు లేదు. మేము ఉద్యోగాలపై ప్రతి రికార్డును సెట్ చేశాం. నేను పదవిలో ఉన్నప్పుడు కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థ వంటి ఆర్థిక వ్యవస్థ దేశంలో ఎప్పుడూ లేదు. కానీ మేము ఎనర్జీ ఇండిపెండెన్స్‌ని మళ్లీ తీసుకువస్తాం’’ అని ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. 

ఇక, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. ఆ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించారు. అప్పడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌తో కలిసి టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో వేలాది మంది భారతీయ అమెరికన్లు హాజరైన భారీ హౌడీ - మోడీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత 5 నెలకు ట్రంప్ మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ను సందర్శించారు.

click me!