విమానంలో ఈ చిన్నారి చేసిన పనికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

Published : Sep 06, 2022, 09:44 AM IST
 విమానంలో ఈ చిన్నారి చేసిన పనికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

సారాంశం

తన అమాయకపు ముఖంతో... చిరునవ్వుతో అందరినీ పలకరించాడు. దీంతో... ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ బాబు వయసు 22 నెలలు కావడం గమనార్హం.

పిల్లలు చాలా అమాయకుంగా ఉంటారు. వాళ్లు చేసే పనులు, అమాయకపు చూపులు ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాయి. వారి నోటి నుంచి వచ్చే ముద్దు ముద్దు మాటలు మరింత ముద్దుగా ఉంటాయి. అందుకే.. పిల్లలకు సంబంధించిన ఏ వీడియో అయినా... నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా... విమానంలో ఓ చిన్నారి చేసిన అల్లరి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇంతకీ ఆ పిల్లాడు చేసిన పనేంటో తెలుసా...? విమానం ఎక్కిన ప్రతి ఒక్కరినీ పలకరించాడు. తన అమాయకపు ముఖంతో... చిరునవ్వుతో అందరినీ పలకరించాడు. దీంతో... ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ బాబు వయసు 22 నెలలు కావడం గమనార్హం.

బాలుడి తల్లి కేలీ నెల్సన్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. గత రెండు వారాలుగా తాము ప్రయాణించిన ప్రతి విమానంలో ప్రతి ఒక్కరినీ తమ కుమారుడు ఇలా పలకరించాడంటూ ఆమె ఆ వీడియోకి క్యాప్షన్ యాడ్ చేయడం గమనార్హం.

 

వీడియోలో చిన్నారి.. విమానం ఎక్కిన తర్వాత తన సోదరుడిని ఫాలో అవుతూ ముందుకు వెళ్లాడు. ఆ తర్వాత విమానంలో తనకు కనిపించిన అందరికీ హాయ్ చెబుతూ వెళ్లడం విశేషం. ఈ వీడియోని ఇప్పటి వరకు 6 మిలియన్ల కు పైగా వీక్షించడం గమనార్హం. నాలుగు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కొందరు కామెంట్స్ చేయగా..... ఈ పిల్లవాడికి ప్రజలందరితో ఎలా ప్రవర్తించాలో తెలుసు అని.. అతనికి ఆరోగ్యం, ఐశ్వర్యం లభించాలంటూ కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?