ఆపరేషన్ సింధూర్‌ను మెచ్చిన అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు

Bhavana Thota   | ANI
Published : May 12, 2025, 09:54 AM IST
ఆపరేషన్ సింధూర్‌ను మెచ్చిన అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు

సారాంశం

పాకిస్తాన్‌పై భారత నాయకత్వం స్పందనను ప్రముఖ అమెరికన్ విదేశాంగ విధాన నిపుణుడు మైఖేల్ కుగెల్మాన్ ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం ఎలా బలమైన నాయకత్వ చతురతను ప్రదర్శించిందో ఆయన హైలైట్ చేశారు.

వాషింగ్టన్ డీసీ: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ దాడుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, మే 7న భారత వైమానిక దళాలు పాక్ భూభాగంలో ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలపై సమన్వయంతో దాడులు జరిపాయి.

ఈ పరిణామాలపై ప్రముఖ అమెరికన్ విదేశాంగ నిపుణుడు మైఖేల్ కుగెల్మాన్ స్పందించారు. భారత ప్రభుత్వం చూపిన నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. గతం లోని సైనిక సంక్షోభాల కంటే ఈసారి భారత్ మరింత బలంగా స్పందించిందని, ఇది 1971 తర్వాత ఇదివరకు ఎప్పుడూ చూడని స్థాయి దాడులని పేర్కొన్నారు.పహల్గాం ఘటనలో పౌరులు లక్ష్యంగా మత ఆధారంగా నెరపబడటం ద్వారా, భారత్‌పై తీవ్ర భావోద్వేగ ప్రభావం పడిందని కుగెల్మాన్ అభిప్రాయపడ్డారు. దీంతో భారత ప్రభుత్వం కఠిన చర్యలకు దిగి, తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుందన్నారు. మునుపటి సంక్షోభాల్లోలాగ కాకుండా, ఈసారి శత్రుత్వ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగినదని, ఇది అంతర్జాతీయంగా కూడా ఆందోళన కలిగించిందని ఆయన చెప్పారు.

ఆపరేషన్ సింధూర్‌ ద్వారా 100కు పైగా ఉగ్రవాదులు మట్టుబెట్టబడ్డారని, పాక్ లోపల 11 వైమానిక స్థావరాలు నాశనం అయినట్లు భారత సాయుధ దళాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో పౌర ప్రాణనష్టాన్ని నివారించడానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.వైమానిక దళాల ఎయిర్ మార్షల్ ఎకె భారతి మాట్లాడుతూ, ఈ ఆపరేషన్‌ లక్ష్యాలను ఖచ్చితంగా సాధించిందని, ప్రపంచానికి భారత్ యొక్క సైనిక శక్తి స్పష్టంగా కనిపించిందన్నారు. ఉగ్రవాద శిబిరాలపై సరిగ్గా లక్ష్యంగా దాడులు చేసి విజయవంతంగా నిర్మూలించామన్నారు.ఇక నౌకాదళానికి చెందిన వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ మాట్లాడుతూ, పాక్ ఇకపై ఏదైనా చర్య తీసుకుంటే, దానికి తగిన స్పందన ఎలా ఉంటుందో వారికి స్పష్టంగా తెలియజేశామన్నారు.ఈ విధంగా, భారత ప్రభుత్వ ప్రతిస్పందన విదేశీ నిపుణుల నుంచి ప్రశంసలు అందుకోవడం, దేశానికి వ్యూహాత్మక విజయం సాధించడమే కాకుండా, అంతర్జాతీయంగా తన స్థాయిని మరింత బలంగా ప్రదర్శించిందని చెప్పొచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే