
బీజీంగ్: ఈశాన్య china లోని డాలియన్ సిటీలో గల మార్కెట్ దిగువన ఉన్న Under ground ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. శుక్రవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు ప్రకటించారు. అయితే భూగర్భ ప్రాంతంలో మంటలను ఆర్పుతూ ఫైర్ ఫైటర్ ఒకరు మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఈ నలుగురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
also read:హైదరాబాద్‌లో మూసీ నది ఒడ్డున భారీ అగ్నిప్రమాదం.. పెద్ద సంఖ్యలో గుడిసెలు దగ్దం
ఇండియాలోని పలు రాష్ట్రాల్లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశిలో బాణాసంచా తయారీ యూనిట్ లో శనివారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఇందులో నలుగురు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
శనివారం నాడు కోల్‌కత్తాలోని ఓ కలర్స్ తయారీ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మరణించారు. ఈ ఫ్యాక్టరీలో మంటలను గుర్తించిన స్తానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.దక్షిణాఫ్రికా పార్లమెంట్ భవనంలో ఆదివారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదం కారణంగా పార్లమెంట్ భవనానికి పగుళ్లు వ్యాపించినట్టుగా స్థానిక అధికారులు తెలిపారు. మంటలు వేగంగా పార్లమెంట్ పైకప్పునకు వ్యాపించినట్టుగా అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్లు ప్రయత్నిస్తున్నారని అధికారులు చెప్పారు. కేప్‌టౌన్ లో 1884 లో ఈ భవనం నిర్మితమైంది. ఆ తర్వాత 1920, 1980 లలో రెండింటిని కట్టారు.