
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకొంది. Mississippi లో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో కాల్పుల ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.
also read:మెక్సికోలో కాల్పులు:ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి
మిస్సిస్సిపీలోని గల్ప్ ఫోర్ట్ న్యూ ఇయర్ పార్టీలో Firing చోటు చేసుకొంది. అయితే పలు తపాకుల నుండి 50 బుల్లెట్లు బయటకు వచ్చాయని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని Police తెలిపారు. అయితే కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.ఈ కాల్పులు జరిగిన సమయంలో మందు పార్టలో ఎంత మంది ఉన్నారనే విషయమై కచ్చితమైన సమాచారం లేదని పోలీస్ ఉన్నతాధికారి రైల్ చెప్పారు.