Russia Ukraine war: మారియుపోల్‌లో శవాల గుట్టలు.. చ‌ర్చ‌ల‌తోనే మ‌రణాహోమం ఆగుతుంది: జెలెన్‌స్కీ

Published : Apr 07, 2022, 05:17 AM IST
Russia Ukraine war: మారియుపోల్‌లో శవాల గుట్టలు.. చ‌ర్చ‌ల‌తోనే మ‌రణాహోమం ఆగుతుంది: జెలెన్‌స్కీ

సారాంశం

Russia Ukraine war: బుచా, మారియుపోల్ పట్టణాల్లో నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను దాచడానికి రష్యా  ప్రయత్నించిందని, మారియుపోల్ లో శవాలు గుట్టల్లా ప‌డి ఉన్నాయ‌ని,  ప‌లు చోట్ల‌ ఒళ్లు గగ్గుర్పాటుకు గురిచేసే దృశ్యాలు దర్శనమిస్తున్నాయ‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.  

Russia Ukraine war: ఉక్రెయిన్ పై రష్యా సైనాలు భీకర దాడులు కొనసాగిస్తుంది. దాదాపు రెండు నెలుల‌గా ఉక్రెయిన్ పై ర‌ష్యా బ‌లగాలు దాడులు కొనసాగిస్తున్నాయి.  ర‌ష్యా దాడుల వ‌ల్ల‌ ఉక్రెయిన్ త‌న రూపురేఖలను కోల్పోయింది. ఎక్కడ చూసిన  శిథిలమైన భవనాలు.. శవాల గుట్టలు కనిపిస్తున్నాయి.  పుతిన్ యుద్ధోన్మాదం వలన ఉక్రెయిన్ ను స‌ర్వ‌  నాశనమైంది. నిత్యం బాంబులు, క్షిపణులు, విమానాలతో దాడుల‌కు పాల్ప‌డుతున్నాయి ర‌ష్యాన్ బలాగాలు. ప్రధాన నగరాలలో ఎక్కడపడితే అక్కడ శవాల గుట్టలు పడివుండటం దర్శనమిస్తున్నాయి. ప‌లు చోట్ల‌ ఒళ్లు గగ్గుర్పాటుకు గురిచేసే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. కుప్పలు తెప్పలుగా శవాలు, వాటికి సామూహిక ఖననాలు, చేతులను వెనక్కు కట్టి పాయింట్ బ్లాంక్‌లో పెట్టి కాల్చి చంపిన ఘటనలు కొకొల్లలుగా బయటపడుతున్నాయి. 

అంతటితో ఆగ‌కుండా.. ఉక్రెయిన్ మ‌హిళ‌ల‌పై,  యువతులపై అత్యాచారాలకు పాల్పడ్డారు ర‌ష్యా సైనికులు . అత్యంత పాశ‌వికంగా ప్ర‌వ‌ర్తించారు. ఈ క్ర‌మంలో లక్షల మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేరే ప్రాంతాలకు వలస పోతున్నారు.

తాజాగా.. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు హబర్‌టర్క్ టీవీతో మాట్లాడుతూ..పోర్టుసీటీ మారియుపోల్‌లో రష్యా వేలాది మంది అమాయ‌కుల హ‌త‌మ‌ర్చారని ఆరోపించారు. మారియు పోల్ న‌గ‌రాన్ని నరకంలా మార్చార‌ని, ఈ న‌గ‌రంలో పదుల సంఖ్యలో కాదు.. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయర‌ని  జెలెన్స్కీ చెప్పారు. ఆ మ‌ర‌ణాల‌కు క‌నిపించకుండా.. ర‌ష్యా సామూహిక ఖ‌నానాల‌కు చేస్తోంద‌ని, శ‌వాల‌ను దాచిపెడుతున్నార‌నీ ఆరోపించారు. రష్యాతో శాంతి చర్చలు లేకుండా ఈ యుద్ధాన్ని ఆపడం కష్టమని జెలెన్స్కీ అన్నారు.

మారియుపోల్ లోకి  వెళ్ల‌కుండా.. రష్యా అడ్డుకుంటోందని, ఎందుకంటే అక్కడ వేలాది మంది అమాయ‌కుల‌ను చంపబడ్డారనే సాక్ష్యాలను దాచాలని ర‌ష్యా బ‌లాగాలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌నీ, అందుకే ఆ భూభాగంలోకి ఎవ్వ‌రిని రాకుండా.. అడ్డుప‌డుతున్నార‌నీ,  ఆ కారణంతో ర‌ష్య‌న్ సైనాల‌  భయపడుతున్నారని, అక్కడ ఏమి జరుగుతుందో ప్రపంచం చూస్తుందని  జెలెన్స్కీ టర్కీ యొక్క హబర్‌టర్క్ టీవీతో అన్నారు.  అయితే, అన్ని సాక్ష్యాలను దాచడంలో రష్యా విజయం సాధించదని,   అన్నింటినీ దాచలేరనీ,  చనిపోయిన, గాయపడిన  ఉక్రేనియన్లందరినీ పాతిపెట్టలేరనీ, అది అసాధ్యమ‌ని చెప్పుకోచ్చారు. శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌కుండా.. ఈ యుద్ధాన్ని ఆపడం కష్టమని  అని జెలెన్స్కీ  భావిస్తున్నారు. 

మ‌రోవైపు... సైనికచర్యను నిలిపివేసేందుకు రష్యా మరో ప్రతిపాదన చేసింది. చర్చల సందర్భంగా సూచించిన షరతులకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరిస్తే మిలిటరీ ఆపరేషన్‌ నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. చర్చలకు అనుకూలమైన పరిస్థితులు నెలకొనేందుకే కీవ్‌ నుంచి బలగాలను ఉపసంహరణ చేపట్టినట్లు క్రెమ్లిన్‌ తెలిపింది. నాటోలో చేరాలనే అన్ని ప్రణాళికలను ఉక్రెయిన్‌ విరమించుకోవాలనే షరతుకు ఒప్పుకోవాలని రష్యా అంటోంది.నాటో నిబంధనల మాదిరిగా పశ్చిమ దేశాల నుంచి చట్టబద్ధమైన భద్రతా హామీ ఇవ్వాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే