Ukraine War : కొన‌సాగుతున్న దండ‌యాత్ర‌.. ర‌ష్యా ఆధీనంలోకి ఉక్రెయిన్ వ్యూహాత్మక పట్టణం లైమన్..

Published : May 29, 2022, 05:53 AM ISTUpdated : May 29, 2022, 05:54 AM IST
Ukraine War : కొన‌సాగుతున్న దండ‌యాత్ర‌.. ర‌ష్యా ఆధీనంలోకి ఉక్రెయిన్ వ్యూహాత్మక పట్టణం లైమన్..

సారాంశం

రోజు రోజుకు ఉక్రెయిన్ దేశాన్ని రష్యా ఆక్రమిస్తూ పోతోంది. తాజాగా ఉక్రెయిన్ కు అతి ముఖ్య పట్ఠణమైన తూర్పు ప్రాంతంలో ఉన్న నగరం లైమన్ ను తాము స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రకటించింది. అయితే దీనిని ఉక్రెయిన్ ఖండించింది. 

ఉక్రెయిన్ పై ర‌ష్యా త‌న దండ‌యాత్ర‌ను కొన‌సాగిస్తూనే ఉంది. మాస్కో బ‌ల‌గాలు చిన్న దేశంపై త‌న ప‌ట్టును మ‌రింత పెంచుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ తూర్పు భాగంలో వ్యూహాత్మక పట్టణంగా ఉన్న లైమ‌న్ ను త‌మ వ‌శం చేసుకున్నాయి. సెవెరోడోనెట్స్క్ పట్టణ కేంద్రాన్ని ర‌ష్యా సైన్యం చుట్టుముట్టినట్లు వార్తా సంస్థ AFP పేర్కొంది. 

Brazil Rains : బ్రెజిల్ లో భారీ వ‌ర్షాలు.. పెర్నాంబుకోలో 28 మంది మృతి..

అయితే తమ వద్ద సెవెరోడోనెట్స్క్ ఉందన్న రష్యా వాదనను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. నగర శివార్లలో రష్యా దాడిని ఉక్రెయిన్ దళాలు తిప్పికొట్టాయని ఒక అధికారి తెలిపారు. కైవ్, ఖార్కివ్‌లలో రష్యా ఎదురుదెబ్బలు ఎదుర్కొంద‌ని చెప్పారు. కాగా మాస్కో ఇప్పుడు ఉక్రెయిన్ తూర్పు భాగంపై దృష్టి సారించింది. తూర్పు డోన్‌బాస్ కోసం పూర్తిస్థాయి యుద్ధం చేసింది. ‘‘ క్రాస్నీ లిమాన్ పట్టణం ఉక్రేనియన్ జాతీయవాదుల నుండి పూర్తిగా విముక్తి పొందింది ’’ అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఇది లైమాన్ సెవెరోడోనెట్స్క్, క్రామాటోర్స్క్‌లకు వెళ్లే మార్గంలో ఉంది.

రీజనల్ గవర్నర్ సెర్గీ గైడే ప్రకారం.. సెవెరోడోనెట్స్క్ పై రష్యన్ షెల్లింగ్ కొనసాగుతోంది. రష్యన్ దళాలు ముగ్గురు పౌరులను హతమార్చగా, బఖ్ముత్, అవడివ్కా, మైకోలైవ్ లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
అయితే  రష్యా బలగాలు మారణహోమానికి పాల్పడుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. డాన్బాస్, ఖార్కివ్ ప్రాంతాల్లో పరిస్థితి కఠినంగా ఉందని జెలెన్స్కీ చెప్పారు. 

చెన్నైలో ఘోరం.. పెళ్లి రోజు నాడే భార్యా పిల్ల‌ల‌ను రంపంతో కోసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. త‌రువాత‌..

‘‘ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ముఖ్యంగా డాన్బాస్, ఖార్కివ్ ప్రాంతంలోని ఆ ప్రాంతాలలో రష్యన్ సైన్యం కనీసం కొంత ఫలితాన్నిదక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది" అని జెలెన్స్కీ చెప్పారు. ఆర్కిటిక్ లో హైపర్ సోనిక్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్లు మోస్కో పేర్కొన్న తరువాత జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రేనియన్ అధ్యక్షుడు కూడా యుద్ధంలో తామే విజయం సాధిస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమించడం ప్రారంభించింది. 

Jignesh Mevani : సీపీఎంపై మండిప‌డ్డ జిగ్నేష్ మేవానీ.. కేర‌ళ ఎల్‌డీఎఫ్, బీజేపీకి మ‌ధ్య ఒప్పందం ఉంద‌ని ఆరోప‌ణ‌

అప్పటి నుంచి  ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడిలో ఇరువైపులా వేలాది మంది చనిపోయారు. 6.6 మిలియన్ల మంది దేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని ఓడరేవు నగరాలైన ఖెర్సన్ , మారియుపోల్‌తో సహా మాస్కో నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఇతర ఉక్రేనియన్ ఓడరేవులు రష్యా యుద్ధనౌకల వల్ల ప్రపంచంతో సంబంధాలు తెగిపోాయాయి.  ఇదిలావుండ‌గా, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై దాడి విష‌యంలో వెనక్కి త‌గ్గ‌డం లేదు. ర‌ష్యా ను  ఒంటరి చేయడం అసాధ్యం అంటూ పశ్చిమ దేశాలకు గురువారం నాడు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. ర‌ష్యాను ఒంటరి చేయాల‌నే ప్ర‌య‌త్నంలో ఆయా దేశాలు త‌మ‌ను తాము గాయ‌ప‌రుచుకుంటాయ‌ని పేర్కొన్నారు. ప్రపంచ ఆహారం మరియు ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతినడంతో ఉక్రెయిన్ యుద్ధం నాల్గవ నెలలో ముగుస్తున్న తరుణంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకంఉది. అయితే కనికరంలేని పుతిన్ మాత్రం ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !