రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సీరియస్ అయ్యారు. అమెరికా ఆర్మీ సాయాన్ని ఉక్రెయిన్ అప్పుగా ఎప్పటికీ ఒప్పుకోదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు..
Zelensky says Ukraine does not consider US military aid a loan: అమెరికా అధ్యక్షుడయ్యాక డొనాల్డ్ ట్రంప్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రభుత్వం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టచ్‌లో ఉంది. కానీ, వైట్ హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ట్రంప్ మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత సీన్ మారింది.
అమెరికా, వెస్ట్రన్ దేశాల సాయంతో రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్ ఇప్పుడు తన రూట్ మార్చింది. అమెరికా-రష్యా దగ్గరవుతుండడం గమనించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అమెరికా నుంచి తీసుకున్న ఆర్మీ సాయాన్ని ఉక్రెయిన్ ఏ విధంగానూ అప్పుగా చూడదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు.
ఈ విషయం గురించి జెలెన్స్కీ మాట్లాడుతూ, ''ఉక్రెయిన్ అమెరికా ఆర్మీ సాయాన్ని అప్పుగా ఎప్పటికీ తీసుకోదు. మేం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాం, ఈ సాయం ఉక్రెయిన్‌కు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం నిలకడగా ఉండటానికి. అమెరికా ఇచ్చింది అప్పు కాదు, ఆ డబ్బును తిరిగి ఇవ్వం. ఆ డబ్బును ట్రంప్ మర్చిపోవాల్సిందే'' అన్నారు. మరి దీనిపై అగ్రరాజ్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే జెలెన్‌స్కీ తీరుపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఓవైపు అమెరికా, రష్యా స్నేహం బలోపేతమవుతుందన్న సంకేతాలు వస్తున్న తరుణంలో కూడా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఇలా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ జెలెన్‌స్కీ మాటల వెనకాల అసలు అర్థం ఏంటి.? ఏ వ్యూహత్మాక ఎత్తుగడతో జెలెన్‌స్కీ ముందుకు వెళ్తున్నారో తెలియాల్సి ఉంది.