
Russia Ukraine War: గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్ పై రష్యన్ సైన్యాలు భీకర దాడి చేస్తున్నాయి. బాంబులు, క్షిపణులు, రాకెట్ లతో ఉక్రెయిన్ పై విరుచుకపడుతున్నాయి. ఉక్రెయిన్ ను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ దాడిలో కీవ్, ఖార్కీవ్, సుమీ, పలు ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ లో ఎక్కడ చూసినా.. రక్తపుటేర్లులు పారుతున్నాయి. వీధుల వెంట మాంసం ముద్దలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు శిథిలాలుగా, శవాల దిబ్బలుగా మారాయి
ఈ క్రమంలో ఉక్రెయిన్ తొలిసారి.. రష్యాపై ఆధిపత్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా సరిహాద్దు లోకి ప్రవేశించి బెల్గోరోడ్ లోని చమురు డిపోపై ఉక్రెయిన్ హెలికాప్టర్లు బాంబులు వేశాయని ఆ దేశ బెల్గోరడ్ గవర్నర్ వ్యచెసేవ్ గ్లడ్కోవ్ ఆరోపించారు. హెలికాప్టర్ నుంచి గన్‌షేల్స్ ద్వారా శుక్రవారం తెల్లవారుజామున దాడులకు దిగినట్టు. ఇరుదేశాల సరిహద్దుకు ఈ ప్రాంతం 35 కిలోమీటర్ల ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడి వల్ల డిపోలో మంటలు చెలరేగడంతో పాటు ఇద్దరు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ దాడులను క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా ధ్రువీకరించారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్ తూర్పు నగరాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కాగా, రష్యాపై ఉక్రెయిన్ నుంచి ఈ తరహా దాడి ఇదే తొలిసారి కావ డం గమనార్హం.
ఇదిలా ఉంటే.. చెర్నోబిల్ అణుకేంద్రం నుం చి రష్యన్ సేనలు నిష్క్రమించాయి. యుద్ధం తొలి రోజుల్లోనే చెర్నోబిల్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా సైన్యాలు అక్కడ కందకాలు తవ్వి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో రేడియో ధార్మికత వెలువడి సైనికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున వెళ్లిపోయినట్లు ఉక్రెయిన్ ఇంధన సంస్థ ఎనెర్గొటమ్ తెలిపింది.
కీవ్‌తో పాటు ఖెర్సాన్ నగరాలపై ఉక్రెయిన్ మళ్లీ పట్టు సాధిస్తోంది. కానీ, రష్యన్ బలగాల ఉపసంహరణపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మరియుపోల్ నుంచి పౌరులతో బయల్దేరిన 45 బస్సుల కాన్వాయ్‌ను రష్యా బలగాలు అడ్డుకున్నా యి. రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు శుక్రవారం వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా మళ్లీ ప్రారంభమయ్యాయి.
ఇదిలా ఉంటే.. రష్యాతో ఉక్రెయిన్, ఆ దేశ సరిహద్దు దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఆస్ట్రేలియా, నెదర్లాండ్ చట్టసభలను ఉద్దేశిం చి మాట్లాడారు. రష్యా దాడికి వ్యతిరేకంగా తమకు అండగా నిలవాలని కోరారు. ఉక్రెయిన్‌కు సాయుధ వాహనాలు పంపుతామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ శుక్రవారం ప్రకటించారు.
భారత్ మధ్యవర్తిత్వానికి రష్యా ఓకే !
భారత్ పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గేయ్ లావ్రోవ్ శుక్రవారం సాయంత్రం ప్రధాని మోడీతో పలు కీలక ఆంశాలపై ఇరుదేశాల నాయకులు చర్చించారు. అంతకుముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌తో లావ్రోవ్ భేటీ అయ్యారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య భారత్ మధ్యవర్తిత్వం కూడా వహించొచ్చునని అన్నారు. అలాగే.. డిస్కౌంట్‌తో భారత్‌కు చమురు ఇచ్చేందుకు రష్యా అంగీకరించింది.