కొడుక్కి వారి పేరు పెట్టుకుని: ప్రాణం పోసిన వైద్యుల రుణం తీర్చుకున్న బ్రిటన్ ప్రధాని

By Siva KodatiFirst Published May 3, 2020, 2:30 PM IST
Highlights

కరోనా రోగులను ప్రాణాలు నిలబెట్టేందుకు తమ జీవితాలను పణంగా పెడుతున్న వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు వారికి సెల్యూట్ చేస్తున్నారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం వైద్యులకు గొప్పగా కృతజ్ఞత చాటుకున్నారు.

కరోనా రోగులను ప్రాణాలు నిలబెట్టేందుకు తమ జీవితాలను పణంగా పెడుతున్న వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు వారికి సెల్యూట్ చేస్తున్నారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం వైద్యులకు గొప్పగా కృతజ్ఞత చాటుకున్నారు. తన కుమారుడికి వైద్యుల పేరు పెట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ ప్రధాని భార్య క్యారీ సీమండ్స్ ఇటీవల ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కొడుకు పుట్టడానికి ముందే బోరిస్ జాన్సన్ కోవిడ్ 19 బారినపడటంతో ఆసుపత్రిలో ఐసీయూలో చావు అంచులదాకా వెళ్లారు.

Also Read:హెచ్- 1బీ వీసాదారులందరికి గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా

ఆయన ప్రాణాలను కాపాడటానికి వైద్యులు తీవ్రంగా కృషి చేసి ప్రధానిని తిరిగి కోలుకునేలా చేశారు. దీంతో తనకు చికిత్స చేసిన వైద్యుల రుణం తీర్చుకోవాలని భావించిన జాన్సన్... తన బిడ్డకు వైద్యుల పేర్లు కలిసొచ్చేలా విల్‌ఫ్రెడ్ లారీ నికోలస్ జాన్సన్‌గా పేరు పెట్టారు.

ఈ పేరులో విల్‌ఫ్రైడ్- బోరిస్ తాత పేరు మీదుగా, లారీ-సైమండ్స్ తాత పేరుకు చిహ్నంగా, నికోలస్-చికిత్స అందించిన నిక్‌ప్రైస్, నిక్‌హార్ట్ వైద్యులకు గుర్తుగా ఎంచుకున్నట్లు బోరిస్ జాన్సన్ భార్య ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.

Also Read:అధ్యక్ష ఎన్నికల్లో నన్ను ఓడించడానికి చైనా కుట్ర పన్నుతోంది: ట్రంప్

ఈ సందర్భంగా తనకు డెలివరీ సమయంలో అండగా నిలిచిన నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రసూతి సిబ్బందికి సీమండ్స్ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ 19 బారి నుంచి కోలుకున్న బోరిస్ జాన్సన్ తిరిగి విధులకు హాజరవుతున్నారు.

ప్రధాని చర్యపై స్పందించిన వైద్యులు.. ఇంతకంటే  గొప్ప గౌరవం ఏముంటుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటి వరకు బ్రిటన్‌లో 1,82,260 మందికి కోవిడ్ 19 సోకగా, 28,131 మంది ప్రాణాలు కోల్పోయారు. 

click me!