లాక్ డౌన్ ఎత్తేస్తే అంతే సంగతులు: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

By Sree s  |  First Published May 2, 2020, 1:22 PM IST

లాక్ డౌన్ ను ఎత్తివేయాలనుకుంటున్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలను చేసింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గింది కాబట్టి లాక్ డౌన్ ను సడలించాలని యోచిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని, కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ విషయంలో ముందఫుగు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు హితవు పలికింది. 


లాక్ డౌన్ ను ఎత్తివేయాలనుకుంటున్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలను చేసింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గింది కాబట్టి లాక్ డౌన్ ను సడలించాలని యోచిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని, కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ విషయంలో ముందఫుగు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు హితవు పలికింది. 

వైరస్‌ పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించవద్దని పలు దేశాలకు సూచించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.  ఈ వైరస్ కి ఇంకా మందు లేదు, వాక్సిన్ కూడా అందుబాటులోకి రానందున ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం, లాక్‌డౌన్‌ మాత్రమే వైరస్‌ వ్యాప్తిని కంట్రోల్‌ చేయగలవని స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 

Latest Videos

ముఖ్యంగా అమెరికా, భారత్‌ లాంటి దేశాలు ఆంక్షలను సడలించే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని, ఉన్నపళంగా సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. 

ఈమేరకు ఆ సంస్థ ఎమర్జెన్సీస్ విభాగ సీనియర్‌ అధికారి డాక్టర్ మైక్  ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.వైరస్‌ కట్టడికి ప్రస్తుతం వివిధ దేశాలు అవలంభిస్తున్న పలు చర్యలు బాగున్నాయని, వాటిని అలానే వైరస్ పూర్తిస్థాయిలో తగ్గుముఖం పెట్టేవరకు కొనసాగించాలని అన్నారు. 

కరోనా ప్రభావం లేని ప్రాంతాలే కదా, అక్కడ లాక్ డౌన్ ఎత్తేస్తే ఏమవుతుందనుకుంటే... తీవ్ర పరిణామాలు ఎదురవవుతాయని ఆయన హెచ్చరించారు. ఆంక్షలను ఎత్తివేడం వల్ల వైరస్ ఒక్కసారిగా ఉధృతంగా వ్యాపించే అవకాశం కూడా లేకపోలేదనిఆయన అభిప్రాయపడ్డాడు. 

సడలింపులు ఇస్తున్న చోట చాలా దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందన్నారు. తొలి లాక్ డౌన్ విధించి ఎత్తేసి మరలా లాక్ డౌన్ పెట్టిన సింగపూర్ ఉదంతాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావించారు. 

ఇకపోతే... దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఆగే సూచనలు కనపించడం లేదు. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 2,293 కేసులు కొత్తగా బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 37,336కు చేరుకుంది. గత 24 గంటల్లో 71 మంది కోవిడ్ -19తో మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1218కి చేరుకుంది. 

ఇప్పటి వరకు దేశంలో 9951 మంది కరోనా వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 26,167 ఉంది. ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 

మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 11,506కు చేరుకుంది. మహారాష్ట్రలో 485 మంది కరోనా వైరస్ తో మృత్యువాత పడ్డారు.

click me!