చర్చిలో బ్రిటన్ ఎంపీ దారుణ హత్య.. కత్తితో పొడిచి, పొడిచి చంపిన నిందితుడు..!

By AN TeluguFirst Published Oct 16, 2021, 7:29 AM IST
Highlights

స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ కౌన్సిలర్,  సౌత్ ఎండ్ మాజీ మేయర్ జాన్ లాంబ్ సైతం కత్తిపోట్ల విషయాన్ని నిర్ధారించారు.

లండన్ : బ్రిటన్ కి చెందిన ఎంపీ ఒకరు దారుణహత్యకు గురయ్యారు. ఎసెక్స్ లోని సౌత్ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపి డేవిడ్ అమీస్ (69) శుక్రవారం  స్థానికంగా  గా లీ-ఆన్-సీలోని  ఓ churchలో పౌరులతో వారాంతపు సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేసి,  కత్తితో పలుమార్లు stabbed.  దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ కౌన్సిలర్,  సౌత్ ఎండ్ మాజీ మేయర్ జాన్ లాంబ్ సైతం కత్తిపోట్ల విషయాన్ని నిర్ధారించారు.

డేవిడ్ అమీస్...UK MP ప్రధాని బోరిస్ జాన్సన్ కు చెందిన Conservative Party నేత.  1983 నుంచి ఎంపీగా ఉన్నారు.   జంతు సమస్యలతో పాటు మహిళల గర్భస్రావాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా David Amisకు స్థానికంగా గుర్తింపు ఉంది.  ఆయన మృతిపై తోటి ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులు అర్పించారు.  ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ ఘటనను ‘భయంకరం.. తీవ్ర దిగ్భ్రాంతికరంగా’ అభివర్ణించారు. 

గతంలోనూ పలువురు బ్రిటిష్ ఎంపీలపై దాడులు జరిగాయి.  2016 లో బ్రేక్ ప్రజాభిప్రాయ సేకరణకు ముందు లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జోక్ కాక్స్ ను కాల్చి చంపారు.  2010లో లేబర్ పార్టీ ఎంపీ స్టీఫెన్ టిమ్స్ కత్తిపోట్లకు గురయ్యారు.

భారత సంతతికి అమెరికా రక్షణ వ్యవస్థలో కీలక పదవి.. నామినేట్ చేసిన జో బైడెన్

ఇదిలా ఉండగా, గత నెలలో అమెరికాలోని 9/11 దాడి తరహాలో లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని  పేల్చివేస్తామని బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యింది. 

ఢిల్లీ విమానాశ్రయాన్ని తాము స్వాధీనం చేసుకుంటామని గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామని బెదిరింపు కాల్ రావడంతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భద్రతా అధికారులు సెప్టెంబర్ 10, శుక్రవారం అర్ధరాత్రి అప్రమత్తమయ్యారు. 

బాంబు బెదిరింపు కాల్ రాత్రి ఢిల్లీలోని రహోలా పోలీస్ స్టేషన్కు వచ్చింది.  విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను తనిఖీ చేయారు. ఈ మేరకు ఢిల్లీ డిసిపి ప్రతాప్ సింగ్ ట్వీట్ చేశారు. విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కాల్సిన వారు ఆలస్యం చేయకుండా ముందుగా రావాలని  డిసిపి ప్రయాణీకులకు సూచించారు.  బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో అన్ని ప్రాంతాలను భద్రతా అధికారులు తనిఖీ చేశారు.

click me!