హిందూ ఆలయాలపై దాడి చేసిన వారిని పట్టుకుని తీరుతాం.. కఠినంగా శిక్షిస్తాం: ప్రధాని

By telugu teamFirst Published Oct 15, 2021, 4:48 PM IST
Highlights

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలు, దుర్గా పూజ మండపాలపై దాడిపై భారత్ తీవ్రంగా స్పందించింది. దీనిపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రకటన చేశారు. హిందూ ఆలయాలపై దాడి చేసిన వారిని కచ్చితంగా పట్టుకుని తీరుతామని, కఠినంగా శిక్షిస్తామని హామీనిచ్చారు. వారు ఏ మతానికి చెందినవారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఢాకా: హిందూ ఆలయాలపై, దుర్గ పూజా వేడుకలపై దాడికి తెగబడిన వారందరినీ కచ్చితంగా పట్టుకుని తీరుతామని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా హామీనిచ్చారు. వారిపై కఠిన action తీసుకుంటామని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై, దుర్గా పూజా మండపాలపై జరిగిన దాడులు కలకలం రేపాయి. Bangladesh సహా Indiaలోనూ తీవ్ర ఆందోళనలకు దారి తీశాయి. ఈ హింసాత్మక ఘటనల్లో నలుగురు మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భయాందోళనలకు దారితీయడంతో PM shaik haseena ప్రభుత్వం గురువారం 22 జిల్లాల్లో ప్యారామిలిటరీ బలగాలను మోహరింపజేసింది.

‘కొమిల్లా జిల్లాలో జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తాం. ఇందులో ప్రమేయమున్నవారిని ఎవరినీ వదిలిపెట్టబోం. వారు ఏ మతానికి చెందినవారనేది పట్టించుకోం. వారిని కచ్చితంగా పట్టుకుని శిక్షిస్తాం’ అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. ఢాకాలోని ఢాకేశ్వరీ నేషనల్ టెంపుల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హిందువులతో ఆమె మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు చెబుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఈ హింసాత్మక ఘటనలపై భారత్ స్పందించింది. ఈ హింసకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. దీనిపై బంగ్లాదేశ్ సానుకూలంగా ప్రకటన విడుదల చేసింది.

Also Read: ఘరానా మోసగాడు.. 75మందిని పెళ్లాడి, 200మందిని వ్యభిచారంలోకి దింపి.. డ్రగ్స్ కు బానిసలుగా చేసి...

దుర్గా పూజా మండపాలను ధ్వంసం చేస్తున్న, రాళ్లు రువ్వుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. ఆ ఆలయాల్లోని దుర్గా దేవతల విగ్రహాలను మూకలు ధ్వంసం చేసిన వీడియోలు ఉన్నాయి.

ఈ హింసాత్మక ఘటనలు తమను కలచివేస్తున్నాయని, బంగ్లాదేశ్‌లో మత వేడుకలపై దాడులు జరగడం ఆందోళనకరమని భారత్ పేర్కొంది. వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించి పారామిలిటరీ బలగాలు మోహరించాయన్న విషయాన్ని తాము గుర్తిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

నలుగురు మరణించిన హాజీగంజ్‌లో ర్యాలీలు తీయడాన్ని బంగ్లాదేశ్ అధికారులు నిషేధం విధించారు.

click me!