7500 బిట్ కాయిన్లను చెత్త బుట్టలో పడేసిన భార్య.. నాసా శాస్త్రవేత్తలను రంగంలోకి దింపిన భర్త..

By SumaBala BukkaFirst Published Dec 23, 2021, 8:59 AM IST
Highlights

36 యేళ్ల జేమ్స్ హోవెల్స్ మాజీ భార్య చేసిన పొరపాటు తో ఏకంగా 7500 బిట్ కాయిన్లను పోగొట్టుకున్నాడు. అతడి భార్య 2013లో 7500 బిట్ కాయిన్ల హార్డ్ డిస్క్ చెత్తబుట్టలో పడేసింది. ఈ హార్డ్ డిస్క్ వెతకడం కోసం నాసా శాస్త్రవేత్తలను నియమించుకున్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా Cryptocurrency భారీ ఆదరణకు నోచుకుంటుంది. వీటికి అంత స్థాయిలో ఆదరణ రావడానికి ముఖ్యకారణం ఒకటి టాక్స్ ఫ్రీ, మరొకటి పకడ్బందీ భద్రత. క్రిప్టోకరెన్సీల లావాదేవీలను Black Chain Technology ఉపయోగించి చేస్తారు. ఆయా యూజర్లు క్రిప్టోకరెన్సీలను ఎన్ క్రిప్టెడ్ సెక్యూరిటీతో భద్రంగా ఒక హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకోవచ్చు. కాగా యుకెకు చెందిన జేమ్స్ హూవెల్స్ మాజీ భార్య చేసిన చిన్న పొరపాటు అతడిని  బిలియనీర్ కాకుండా చేసింది.

చెత్త బుట్టలో పడేసిన భార్య..
ప్రపంచంలోని అత్యంత  దురదృష్టవంతుడు అంటే ఇతడేనేమో..! 36 యేళ్ల జేమ్స్ హోవెల్స్ మాజీ భార్య చేసిన పొరపాటు తో ఏకంగా 7500 బిట్ కాయిన్లను పోగొట్టుకున్నాడు. అతడి భార్య 2013లో 7500 బిట్ కాయిన్ల హార్డ్ డిస్క్ చెత్తబుట్టలో పడేసింది. ఈ హార్డ్ డిస్క్ వెతకడం కోసం నాసా శాస్త్రవేత్తలను నియమించుకున్నాడు.

బిలియనీర్  కావాల్సిన వాడు..
జేమ్స్ హోవెల్స్  మాజీ భార్య చేసిన చిన్న పొరపాటు బిలియనీర్ అవ్వకుండా చేసింది. నేడు 7500 Bitcoins విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు 3404 కోట్లకు సమానం.  పోగొట్టుకున్న Hard disk సంపాదించేందుకు అమెరికా ఒన్ ట్రాక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.  వీరు గతంలో కొలంబియా స్పేస్ షటిల్ భూమిపై కూలి పోయినప్పుడు NASAకు సహాయాన్ని అందించారు. ఈ హార్డ్ డిస్క్ పొందేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు జేమ్స్. ఈ హార్డ్ డిస్క్ వెతుకులాటలో వన్ ట్రాక్ విజయవంతమైతే దానిని క్రాక్ చేయడంతో జేమ్స్ రాత్రికి రాత్రే బిలియనీర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడి స్థానిక సౌత్ వేల్స్ పోలీసులు హార్డ్ డిస్క్ వెతికేందుకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు.

Covid In UK : యూకేలో కరోనా విలాయ‌తాండ‌వం.. ఒక్కరోజే 1లక్షా 6వేలకు పైగా కేసులు

ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్ కు పెరుగుతున్న క్రేజ్ తో అదే స్తాయిలో మోసగాళ్లు అలర్ట్ అవుతున్నారు. సెప్టెంబర్ లో హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన షేక్ నసీబుద్దిన్ ఫోన్ నెంబర్ సంపాదించారు సైబర్ నేరగాళ్ళు. ఈ నెంబర్ ను బిట్ కాయిన్ - ఎం8 పేరుతో వున్న వాట్సాఫ్ గ్రూప్ లో యాడ్ చేశారు. బిట్ కాయిన్ వ్యాపారంలో శిక్షణ ఇస్తామని... దీని ద్వారా కోట్లల్లో సంపాదించవచ్చని అతడిని నమ్మించారు. ట్రైనింగ్ ఇస్తున్నట్లు మభ్యపెట్టి విడతల వారిగా నసీబుద్దిన్ నుండి రూ.14లక్షల వరకు కాజేశారు చీటర్స్.  

అందినకాడికి నసీబుద్దిన్ నుండి దోచేసిన కేటుగాళ్లు అతడికి అనుమానం రాగానే వాట్సాప్ గ్రూప్ నుండి డిలేట్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన నసీబ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

ఇదిలావుంటే హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన ఓ మహిళా వ్యాపారి రేఖను నుండి సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. ఆమె అమెరికన్ ఎక్స్  ప్రెస్ రెండు క్రెడిట్  కార్డుల వివరాలను సేకరించి ఆమెకు తెలియకుండానే రూ.5.70 లక్షలు కాజేసారు. తన ప్రమేయం లేకుండానే క్రెడిట్ కార్డు నుండి డబ్బులు మాయం కావడంతో సదరు మహిళ సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేసింది. క్లోనింగ్ ద్వారా కేటుగాళ్లు నకిలీ కార్డులు సృష్టించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

click me!