Covid In UK : యూకేలో కరోనా విలాయ‌తాండ‌వం.. ఒక్కరోజే 1లక్షా 6వేలకు పైగా కేసులు

By Rajesh KFirst Published Dec 23, 2021, 8:34 AM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ విజృంభిస్తోంది.  ఈ  క్ర‌మంలో బ్రిటన్‌పై  ప్రభావితం తీవ్రంగా ఉంది.  గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,06,122  కోవిడ్ కేసులు న‌మోదు కాగా, 140 మరణాలు నమోదయ్యాయి. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి.. నుంచి బ్రిటన్ లో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.  
 

Covid In UK : ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ విజృంభిస్తోంది. చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదయ్యాయి. ఈ వైర‌స్ ప్ర‌భావం అత్య‌ధికంగా ఐరోపా దేశాలలో ఉంది. అందులోనూ బ్రిటన్‌పై ఓమిక్రాన్ ప్రభావితం ఎక్కువ‌గా ఉంది. దీంతో కొత్త వేరియంట్ ధాటికి ఈ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకి కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,06,122  కోవిడ్ కేసులు న‌మోదు కాగా, 140 మరణాలు నమోదయ్యాయి. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి.. నుంచి బ్రిటన్ లో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసుల‌తో దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 11,647,473 కు, క‌రోనా మరణాల సంఖ్య 1,47,573 కి చేరిన‌ట్టు అధికారిక గణాంకాలు చెప్పుతున్నాయి.  
  
ఈ క్ర‌మంలో మూడవ టీకా అంటే బూస్టర్ డోస్ డిమాండ్ పెరుగుతోంది. బూస్ట‌ర్ డోస్ తీసుకోవాల‌ని యూకే ప్ర‌భుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటివరకు 30 మిలియన్లకు పైగా ప్రజలు ఇక్కడ బూస్టర్ డోస్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా క్ర‌మంగా పెరుగుతోన్నాయి. ఇప్పటివరకు 37,101 ఓమిక్రాన్ కేసులు అన్న‌ట్టు అధికారిక గ‌ణాంకాలు వెల్లడించాయి. అలాగే.. ఐదు నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఫైజర్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవాల‌ని బ్రిటిష్ రెగ్యులేటర్లు బుధవారం ఆమోదించారు.

read Also: భారత పౌరసత్వం కోసం 7306 మంది పాకిస్థానీల దరఖాస్తులు..

అలాగే.. ఒమిక్రాన తో పోరాడ‌టానికి ల‌క్షలాది యాంటీవైరల్‌లను కొనుగోలు చేయ‌డానికి వ్యాక్సిన్ కంపెనీల‌తో ఒప్పందాలు చేసుకున్న‌ట్టు బ్రిటిష్ ప్రభుత్వం  తెలిపింది. ఇందుకోసం రెండు కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ఈ ఒప్పందాల ప్ర‌కారం..  వ‌చ్చే ఏడాది ప్రారంభం నాటికి యాంటీవైరల్‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలుస్తోంది. 

Read Also: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్, న్యూయర్ వేడుకలను రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

మ‌రో వైపు .. బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ క్రిస్‌మస్‌కు ముందు ఇంగ్లాండ్‌లో తదుపరి COVID పరిమితులను ప్రవేశపెట్టబోనని మంగళవారం ధృవీకరించడంతో తాజా గణాంకాలు వచ్చాయి, అయితే ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల క్రిస్మస్ తర్వాత కూడా అడ్డాలను విధించవచ్చని హెచ్చరించారు.
 

click me!