వాల్‌మార్ట్ స్టోర్‌లో రెండు మహిళా గ్రూపుల మధ్య కుమ్ములాట.. పోల్స్, షూస్‌లతో దాడి.. వీడియో వైరల్

By Mahesh KFirst Published Oct 16, 2022, 3:48 PM IST
Highlights

అమెరికాలోని ఓ వాల్‌మార్ట్ స్టోర్‌లో రెండు మహిళా గ్రూపుల మధ్య తీవ్ర వాదులాట జరిగింది. చేతికి ఏది దొరికితే దానితోనే ఎదుటి వారిపై విరుచుకుపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

న్యూఢిల్లీ: ఓ వాల్‌మార్ట్‌ స్టోర్‌లో రెండు మహిళా గ్రూపుల మధ్య  కుమ్ములాట జరిగింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కొందరు షూలతో, ఇంకొందరు పోల్స్ పట్టుకుని వచ్చి దాడులు చేసుకున్నారు. కొందరైతే ఆ స్టోర్‌లో ఏది దొరికితే దానితో దాడులు చేసుకున్నారు. కనీసం పది నుంచి 25 మంది వరకు ఈ ఘర్షణలో పాలుపంచుకున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.

అమెరికాలోని మిస్సోరిలో ఫెర్గుజన్ పట్టణంలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో ఈ ఘర్షణ జరిగింది. వాల్ మార్ట్ స్టోర్‌లో సెల్ఫ్ చెక్ ఔట్ ఏరియాలో ఈ ఘటన చటుచేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఈ ఘటన గురించి చెప్పారు. కానీ, పోలీసులు వచ్చే లోపు ఈ ఘర్షణ పూర్తైంది. ఎక్కడివారు అక్కడ వెళ్లిపోయారు.

Its Always Some Going On. Action City 😭🤣🤣 pic.twitter.com/18VWlv66ee

— Suzy Bee (@EssBeeSaid)

వారు ఒకరికి తెలిసినవారే అయివుండొచ్చని పోలీసులు నమ్ముతున్నారు. ఒక డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో 20 మందికి మించి ఒకే ఘర్షణలో పాలుపంచుకోవడాన్ని తాము ఇది వరకు చూడలేదని వారు చెబుతున్నారు.

Also Read: కాలేజీలో.. ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కొట్లాట.. వీడియో వైరల్..!

అయితే, ఆ ఘర్షణల్లోని కొందరు వ్యక్తులను తాము గుర్తించామని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని వివరించారు. ఈ ఘర్షణలకు పాల్పడ్డ వారిలో ఒక్కరినైనా ఇంకా అరెస్టు చేయలేదని తెలిపారు. వాల్ మార్ట్ స్టోర్ మెటీరియల్, ఇతర వస్తువులు ధ్వంసం అయినట్టు తెలుస్తున్నది. ఆ స్టోర్ ఫిర్యాదు చేస్తే..  నిందితులను పట్టుకుంటామనే ధోరణిని పోలీసులు వెల్లడించారు.

click me!