మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం.. బార్‌లో రెచ్చిపోయిన దుండగులు.. 12 మంది మృతి..

Published : Oct 16, 2022, 02:56 PM IST
మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం.. బార్‌లో రెచ్చిపోయిన దుండగులు.. 12 మంది మృతి..

సారాంశం

మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఇరాపువాటోలోని ఓ బార్‌లో గుర్తుతెలియని ముష్కరులు కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. 

మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఇరాపువాటోలోని ఓ బార్‌లో గుర్తుతెలియని ముష్కరులు కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఆరుగులు పురుషుుల ఉన్నారు. ఈ ఘటనను స్థానిక అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ దాడికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. దుండగులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయని నగర పాలక సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇక, మెక్సిక్‌లో కాల్పుల ఘటనలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గ్వానాజువాటో రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న రెండో సామూహిక కాల్పులు ఘటన ఇది. 

అంతుకు ముందు సెప్టెంబరులో ఇరాపుటోకు ఆగ్నేయంగా 60 మైళ్ళు (96 కి.మీ) దూరంలో ఉన్న గ్వానాజువాటో పట్టణంలోని టారిమోరోలోని ఓ బార్‌లో ముష్కరులు పది మందిని కాల్చి చంపారు. ఆ తర్వాత అక్టోబరు 6న గెర్రెరో రాష్ట్రంలోని సిటీ హాల్‌లో ముష్కరులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో నగర మేయర్‌తో సహా 10 మందికి పైగా ప్రజలు మరణించారు.

ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు.. మెక్సికోలో రికార్డు స్థాయిలో ముఠా హింసను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేశారు.  అయితే  రక్తపాతం, హింసను అరికట్టడానికి ఆయన పోరాడుతున్నప్పటికీ.. మెక్సికోలో తరుచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !