Omicron variant: దక్షిణాఫ్రికాలోని గాబోరోన్, బోట్స్వానా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్ కు చెందిన మరో రెండు వేరియంట్లను గుర్తించినట్టు వెల్లడించింది. ఈ కేసులు నమోదైన ప్రాంతాలు, కేసులను అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
Coronavirus: యావత్ మానవాళికి కరోనా వైరస్ మహమ్మారి సవాలు విసురుతూనే ఉంది. రోజురోజుకూ తన రూపు మార్చుకుంటున్న కరోనా మమహ్మారి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే వెలుగుచూసిన అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్, దాని సబ్ వేరియంట్ బీఏ.ఈ ల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఎక్స్ఈ వేరియంట్ (New Covid-19 mutant XE) వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ ఒమక్రిన్, దాని సబ్ వేరియంట్ బీఏ.2 కంటే వేగంగా 10 శాతం అధికంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం అమెరికా సహా పలు యూరప్ దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. భారత్ లోనూ ఈ వేరియంట్ కు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తో పాటు అన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో మరో రెండు కొత్త కరోనా వైరస్ వేరియంట్లను పరిశోధకులు గుర్తించారు. దక్షిణాఫ్రికాలోని గాబోరోన్, బోట్స్వానా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్ కు చెందిన మరో రెండు వేరియంట్లను గుర్తించినట్టు వెల్లడించింది. ఈ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. కొత్తగా గుర్తించిన కరోనా ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5 వేరియంట్ల ప్రభావం, వ్యాప్తి ఏ విధంగా ఉంటుందనేదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీటి సంభావ్య ప్రభావం, దాని తీవ్రతపై మరింత సమాచారాన్ని ఏర్పాటు చేయడానికి సోకిన వారు ప్రస్తుతం పరిశోధకుల పర్యవేక్షణలో ఉన్నారు. కొత్తగా గుర్తించిన వేరియంట్ల బారినపడ్డవారిలో రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు ఉన్నారని అధికారులు తెలిపారు.
undefined
కొత్తగా గుర్తించిన ఈ బీఏ.4, బీఏ.5 వేరియంట్లు ఒమిక్రాన్ వేరియంట్ల కంటే ఎక్కువ వ్యాధి ప్రభావం, వ్యాప్తి చూపాతాయా? లేదా? అనేది ఇంకా స్పష్టంగా తెలియదనీ, దినికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం కొత్తగా గుర్తించిన కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లపై స్పందించింది. ప్రపంచ దేశాలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవరసముందని స్పష్టం చేసింది. కొత్త బీఏ.4, బీఏ.5 సబ్ వేరియంట్లపై పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపింది. అత్యంత వేగంగా సంక్రమించే ఓమిక్రాన్ జాతికి చెందిన ఈ రెండు కొత్త ఉప-వేరియంట్‌లు మరింత అంటువ్యాధి లేదా ప్రమాదకరమైనవా అని అంచనా వేయడానికి కొన్ని డజన్ల కేసులను ట్రాక్ చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
WHO ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు BA.4 మరియు BA.5 వేరియంట్లకు సంబంధించి కొన్ని డజన్ల కేసులు మాత్రమే నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, డెన్మార్క్, బోట్స్వానా, స్కాట్లాండ్, ఇంగ్లాండ్‌లలో BA.4 కనుగొనబడింది. BA.5 కేసులు గత వారం నాటికి దక్షిణాఫ్రికాలో ఉన్నాయి, అయితే సోమవారం బోట్స్వానా ఆరోగ్య మంత్రిత్వ శాఖ BA.4 మరియు BA.5 వేరియంట్ కు చెందిన నాలుగు కేసులను గుర్తించినట్లు తెలిపింది, మొత్తం 30 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో పూర్తిగా టీకాలు తీసుకున్నవారు వేరియంట్ బారినపడటం గమనార్హం.