ఫిలిప్పీన్స్​లో వర్ష బీభత్సం.. విరిగిపడిన కొండచరియలు.. 43కు చేరిన మృతుల సంఖ్య

Published : Apr 13, 2022, 10:24 AM IST
ఫిలిప్పీన్స్​లో వర్ష బీభత్సం.. విరిగిపడిన కొండచరియలు.. 43కు చేరిన మృతుల సంఖ్య

సారాంశం

ఫిలిప్పీన్స్​లో మరోసారి వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉష్ణమండల అల్పపీడనం వల్ల దక్షిణ, మధ్య ఫిలిప్పీన్స్‌లో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా పలువురు మృతిచెందారు. 

ఫిలిప్పీన్స్​లో మరోసారి వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉష్ణమండల అల్పపీడనం వల్ల దక్షిణ, మధ్య ఫిలిప్పీన్స్‌లో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా పలువురు మృతిచెందారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య కనీసం 43కి చేరిందని మంగళవారం అధికారులు తెలిపారు. 28 మంది ఆచూకీ గల్లంతైందని చెప్పారు. సెంట్రల్ లేటె ప్రావిన్స్‌లోని బేబే నగరంలో శని, ఆది వారాల్లో కొండచరియలు విరిగిపడటంతో 100 మందికి పైగా గ్రామస్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

సైన్యం, పోలీసులు, ఇతర రెస్యూ సిబ్బంతి.. గల్లంతైన వారి ఆచూకీని కనుగొనడానికి సహాయక చర్యలు చేపట్టినట్టుగా అధికారులు వెల్లడించారు. కొండచరియలు విరిగిపడటంతో.. బురద, మట్టిదిబ్బలు పేరుకుపోయాయి. దీంతో సైన్యం, పోలీసులు.. సహాయకు చర్యలు చేపట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. 

‘‘ప్రాణనష్టం, ఆస్తుల ధ్వంసానికి కారణమైన ఈ భయంకరమైన సంఘటన పట్ల మేము చింతిస్తున్నాము’’ అని ఆర్మీ బ్రిగేడ్ కమాండర్ కల్నల్ నోయెల్ వెస్టుయిర్ పేర్కొన్నారు. నోయెల్ వెస్టుయిర్.. ప్రస్తుతం ఘటన స్థలాల్లో రెస్క్యూ టీమ్స్ పర్యవేక్షించడంలో సహాయం అందజేస్తున్నారు. బేబేలోని కొండచరియలు విరిగిపడిన గ్రామాలకు పెద్ద సంఖ్యలో సహాయక సిబ్బంది, భారీ పరికరాలు చేరుకున్నాయని నోయెల్ వెస్టుయిర్  తెలిపారు. అయితే వర్షం ఇంకా కొనసాగుతుండటం సహాయక చర్యలకు ఆటంకలం కలుగుతుందని.. ఇది పెద్ద సవాలుగా మారిందని చెప్పారు. వర్షం కురుస్తూనే ఉండటం వల్ల కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను వెంటనే క్లియర్ చేయడం సాధ్యపడటం లేదని తెలిపారు. 

ఇక, వరదల్లో చిక్కుకున్న సెంట్రల్ కమ్యూనిటీలలోని కొంతమంది గ్రామస్తులలో కొంతమందిని సోమవారం కోస్ట్ గార్డ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించాయి. ఇళ్ల పైకప్పులపై ఉన్నవారికి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

ఇక, ప్రతి ఏడాది కనీసం 20 తుఫానులు ఫిలిప్పీన్స్‌ను దెబ్బతీస్తున్నాయి. ఇవి ఎక్కువగా జూన్‌లో ప్రారంభమయ్యే వర్షాకాలంలో చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇటీవలి సంవత్సరాలలో మండుతున్న వేసవి నెలల్లో కూడా కొన్ని తుఫానులు వచ్చాయి.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే