నేపాల్ లో అర్ధరాత్రి భూకంపం... వెంటవెంటనే రెండుసార్లు కంపించిన భూమి

By Arun Kumar PFirst Published Apr 28, 2023, 10:30 AM IST
Highlights

గత అర్థరాత్రి వరుసగా రెండు భూకంపాలు సంభవించి స్థానికులను భయాందోళనకు గురిచేసాయి. 

ఖాట్మండు : నేపాల్ లో గురువారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. వెంటవెంటనే  రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే భూకంప తీవ్రత తక్కువగా వుండటంతో ప్రాణనష్టమేమీ జరగలేదు. ఆస్తినష్టం కూడా పెద్దగా జరగలేదని నేపాల్ అధకారులు చెబుతున్నారు. 

నేపాల్ లోని దహకోట్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. గురువారం అర్థరాత్రి ప్రజలంతా నిద్రలో వుండగా ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ఉలిక్కిపడిన ప్రజలు ఇళ్లనుండి బయటకు పరుగు తీసారు. ఇలా వెంటవెంటనే రెండుసార్లు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంపాల తీవ్రత 5.9, 4.8 గా నమోదయ్యాయి. 

గతంలో గోర్ఖా జిల్లాలో సంభవించిన భారీ భూకంపం మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. 2015 లో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.8 గా నమోదయ్యింది. ఈ భూకంపం కారణంగా దాదాపు 9వేల మంది ప్రాణాలు కోల్పోగా మరో 22వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే భారీ ఆస్తి నష్టాన్ని ఈ భూకంపం మిగల్చింది. 

గోర్ఖా మారణహోమం తర్వాత భూకంపం అంటేనే నేపాలీలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో తాజా భూకంప తీవ్రత ఎక్కువగా లేకున్నా నేపాల్ లో అలజడి రేగింది. దేశ ప్రజలు ఆందోళనకు గురికావద్దని... భూకంప ప్రభావం తక్కువగా వుందంటూ నేపాల్ ప్రభుత్వం ధైర్యం చెబుతోంది. 

Read More  ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..

ఇదిలావుంటే ఈ నెలలో భారత్ లోనూ స్వల్ప భూకంపాలు సంభవించాయి. ఇటీవల మేఘాలయలోని సౌత్ గారో హిల్స్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత  3.5 గా వుందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ  నివేదించింది.

అలాగే అండమాన్, నికోబార్ దీవులలోని క్యాంప్‌బెల్ బేలో ఇటీవల 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీర్‌లో లోనూ ఇటీవల భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0 గా నమోదైంది. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. 

click me!