పాకిస్థాన్‌లో ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులతో సహా.. ఏడు గురు మృతి...

By SumaBala BukkaFirst Published Apr 27, 2023, 3:07 PM IST
Highlights

పాకిస్తాన్ లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బోగీలో మంటలు చెలరేగడంతో ముగ్గురు చిన్నారులు, ఓ మహిళతో సహా ఏడుగురు మృతి చెందారు. 

పాకిస్థాన్ : దక్షిణ పాకిస్తాన్‌లో ఓ రైలులో మంటలు చెలరేగడంతో కనీసం ఏడుగురు మరణించినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ ఘటన రాత్రిపూట కదులుతున్న ట్రైన్ లో జరిగింది. సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీకి ఉత్తరాన 500 కిలోమీటర్ల (300 మైళ్లు) దూరంలో ఉన్న ఖైర్‌పూర్‌లో రైలులో మంటలు చెలరేగాయని రైల్వే అధికారి మొహ్సిన్ సియాల్ తెలిపారు. మంటలు చెలరేగడంతో కదులుతున్న రైలు కిటికీలోంచి దూకి ఓ మహిళ చనిపోగా, మంటల్లో ఆరుగురు మృతి చెందారని తెలిపారు.

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో మంటలు చెలరేగడంతో ముగ్గురు పిల్లలు, ఒక మహిళతో సహా కనీసం ఏడుగురు మరణించారని గురువారం అధికారులు తెలిపారు. ఈ సంఘటన బుధవారం అర్థరాత్రి కరాచీ నుండి లాహోర్‌కు ప్రయాణిస్తున్న కరాచీ ఎక్స్‌ప్రెస్ రైలులో అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే బిజినెస్ క్లాస్ కోచ్‌లో మంటలు చెలరేగాయి.

పాక్ రైల్వేస్ ప్రతినిధి మక్సూద్ కుండి మాట్లాడుతూ, క్యారేజ్‌లో మంటలు ఎలా ప్రారంభమయ్యాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, ఆ తర్వాత రైలులోని మిగిలిన భాగం నుండి వేరుచేయబడిందని తెలిపారు.

మంటలు రైలులోని అనేక ఇతర భోగీలను కూడా తీవ్రంగా దెబ్బతీశాయని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని ఆయన చెప్పారు.కరాచీ నుండి తూర్పు నగరమైన లాహోర్‌కు వెళ్తుండగా, బోగీలో మంటలు చెలరేగడంతో కాలిపోయిన భాగాలను టీవీ ఫుటేజీ చూపిస్తోంది. బుధవారం రాత్రి రైలులో మంటలు చెలరేగాయని, ఆ మంటలు ఒక బోగినుంచి మరో బోగికి అంటుకున్నాయని స్థానిక మీడియా పేర్కొంది.

పాకిస్తాన్‌లో, నిరుపేద ప్రయాణీకులు తరచూ తమ భోజనం స్వయంగా వండుకోవడానికి రైళ్లలో తమతో పాటు చిన్న గ్యాస్ స్టవ్‌లను తీసుకువస్తారు. ఇలా చేయడం శిక్షార్హం, నిషేధం అయినప్పటికీ రద్దీగా ఉండే రైళ్లలో భద్రతా నిబంధనలు తరచుగా ఉల్లంఘించబడుతుంటాయి. పాకిస్తాన్‌లో రైలు ప్రమాదాలు తరచుగా పేలవమైన రైల్వే నిర్వహణ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరుగుతాయి.

2019లో, తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో వంట గ్యాస్ స్టవ్ పేలడంతో రైలులో మంటలు చెలరేగడంతో కనీసం 74 మంది ప్రయాణికులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు.

click me!