24 గంటల్లో నాలుగు భూకంపాలు.. టర్కీ, సిరియా అతలాకుతలం.. 4వేలమందికి పైగా మృతి..

By SumaBala BukkaFirst Published Feb 7, 2023, 12:50 PM IST
Highlights

టర్కీ, సిరియాలను అతలాకుతలం చేసిన భూకంపం తీవ్రత ఇంకా పెరుగుతోంది. 24 గంటల్లో నాలుగు భూకంపాలు వరుసగా టర్కీని తాకాయి. 

ఇస్తాంబుల్ : సోమవారం తెల్లవారుజామున దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలో 7.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. నూర్దగి పట్టణానికి 26 కిలోమీటర్ల (16 మైళ్లు) దూరంలో గజియాంటెప్ నుండి 33 కిలోమీటర్ల (20 మైళ్ళు) దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కొన్ని గంటల తర్వాత, ఆగ్నేయ టర్కీలోని కహ్రామన్మరాస్ ప్రాంతంలో 7.6 తీవ్రతతో రెండవ భూకంపం సంభవించింది. ఇది 7 కి.మీ లోతులో సంభవించింది. భూకంప కేంద్రం కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లోని ఎల్బిస్తాన్ ప్రాంతంలో ఇది వచ్చింది. ఆ తరువాత సాయంత్రం మధ్య టర్కీలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.  24 గంటల్లో నాలుగు సార్లు వచ్చిన భూకంపాలతో టర్కీ, సిరియా అతలాకుతలం అయ్యాయి. 

భారీ భూకంపం తరువాత టర్కీ,  పొరుగున ఉన్న వాయువ్య సిరియాలో మరణించిన వారి సంఖ్య 4,400లు దాటిందని రాయిటర్స్ తెలిపింది. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం అక్కడి ఎన్నో అపార్ట్‌మెంట్లను పేకమేడల్లా కూల్చివేసింది, ఆసుపత్రులు ధ్వంసం అయ్యాయి. వేలాది మంది గాయపడ్డారు, నిరాశ్రయులయ్యారు.

రెస్క్యూ కార్యకలాపాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. అయితే చలి, మంచు, రాత్రిపూట చీకటి అవరోధాలుగా మారాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోయాయి, శిథిలాల కింద చిక్కుకున్న వారి పరిస్థితి, నిరాశ్రయులై రోడ్డున పడ్డ వారి పరిస్థితి మరింత దిగజారిందని రాయిటర్స్ తెలుపుతోంది.

టర్కీ, సిరియా భూకంపాన్ని ముందే ఊహించారా? మూడు రోజుల ముందే చేసిన ట్వీట్ నిజమయిందా?

2021 ఆగస్టులో రిమోట్ సౌత్ అట్లాంటిక్‌లో వచ్చిన భూకంపం తరువాత.. యూఎస్ జియోలాజికల్ సర్వే ద్వారా నమోదైన అతిపెద్ద భూకంపం ఇదే. ఈ భూకంపాల ప్రభావంతో కనీసం నాలుగు టర్కీ విమానాశ్రయాలు దెబ్బతిన్నాయని, శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్న వ్యక్తుల నుండి సోషల్ మీడియాలో సహాయం కోసం కాల్‌లను ట్రాక్ చేస్తున్న అధికారులు తెలిపారు. టర్కీలో 6,200కు పైగా భవనాలు కూలిపోయాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం వల్ల దేశంలోని అన్ని వైద్య కేంద్రాలు గాయపడిన వారితో నిండిపోయాయని రెస్క్యూ కార్యకర్తలు తెలిపారు. ప్రసూతి ఆస్పత్రులను కూడా క్షతగాత్రుల చికిత్స కోసం పనిచేసేలా మార్చేశారు. అన్ని ఆసుపత్రుల్లోనూ క్షతగాత్రులకే వైద్యం అందేలా చర్యలు తీసుకున్నామని SAMS వైద్య సంస్థ తెలిపింది. 

రష్యా విమానం టేకాఫ్ అవుతుండగా మంటలు.. ఫ్లైట్‌లో 300 మంది ప్రయాణికులు (వీడియో)

ఉపగ్రహాల సహాయంతో రెస్క్యూ ప్రయత్నాలు..

ఫిబ్రవరి 6, 2023న సిరియా, టర్కీలో సంభవించిన 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం, 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వంటి విపత్తులలో, రెస్క్యూ, రికవరీ ప్రయత్నాలలో శాటిలైట్ ఇమేజింగ్‌పై అంతర్జాతీయ సహకారం కీలక పాత్ర పోషిస్తుంది.

ఇటువంటి డేటా రోడ్లు, వంతెనలు, భవనాల పరిస్థితిని మ్యాప్ చేయడం ద్వారా నీరు, ఆహారాన్ని మెరుగ్గా అందించడానికి మానవతా సహాయాన్ని అనుమతిస్తుంది.  స్టేడియంలు లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడం ద్వారా భూకంపం తరువాతి ప్రమాదాలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న జనాభాను గుర్తించడం అత్యంత కీలకంగా మారింది. 

click me!