పెరూలో విగిరిపడిన కొండచరియలు.. 36 మంది మృతి..

By Sumanth KanukulaFirst Published Feb 7, 2023, 11:09 AM IST
Highlights

పెరూలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడటంతో 36 మంది మరణించారు.

పెరూలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడటంతో 36 మంది మరణించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ పేరూలోని అనేక గ్రామాలకు బురద, నీరు, రాళ్లు కొట్టుకువచ్చాయి. ఈ విపత్తు కారణంగా కనీసం 36 మంది మరణించినట్టుగా అధికారులు సోమవారం వెల్లడించారు. మిస్కి అనే రిమోట్ సెక్టార్‌లో 36 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఇక, మృతుల్లో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు కూడా ఉన్నారు. బురద ఉప్పెనతో వారి వాహనాన్ని నదిలోకి నెట్టింది. 

ప్రధాన రహదారిపై మూడు కిలోమీటర్ల (దాదాపు రెండు మైళ్లు) మేర ఉన్న చెత్తను తొలగించేందుకు భారీ యంత్రాలను పంపాలని స్థానిక అధికారులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 630 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వంతెనలు, నీటిపారుదల కాలువలు, రోడ్లు కూడా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇక, పెరూలో ఫిబ్రవరిలో తరుచుగా వర్షాలు కురవడం, కొండచరియలు విరిగిపడటం చోటుచేసుకుంటుంటాయి.

click me!