అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మనోసారి మాట్లాడారు. ఈసారి వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మరోసారి మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ తో రష్యా సంఘర్షణపై వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ మాట్లాడారు. ఆ తర్వాత జెలెన్స్కీకి కూడా ఫోన్ చేసి మాట్లాడారు ట్రంప్.
పుతిన్ 30 రోజుల పాటు ఉక్రెయిన్ పై దాడులను ఆపడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. కానీ దీన్ని అతిక్రమించి 150 డ్రోన్లతో ఉక్రెయిన్ ఎనర్జీ సౌకర్యాలపై తాజాగా రష్యా దాడి చేసిందట. దీంతో ఈ విషయం గురించి జెలెన్స్కీ ట్రంప్‌తో మాట్లాడారు., భవిష్యత్తులో ఇలాంటి ఒప్పందాలను రష్యా పాటించేలా చూడాలని ట్రంప్ ను కోరారు.
ఉక్రెయిన్ భూభాగం, సార్వభౌమత్వం విషయంలో రాజీపడేది లేదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. రష్యా ఆక్రమించిన ప్రాంతాలను ఆ దేశ భూభాగాలుగా ఉక్రెయిన్ ఎప్పటికీ గుర్తించదని తేల్చి చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించినందున శాంతికి కట్టుబడి ఉందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు.
పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయడానికి సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా సాంకేతిక చర్చలు జరపనున్నాయి. 2022లో రష్యా దాడి చేసినప్పటి నుండి కొనసాగుతున్న ఈ సంఘర్షణకు పరిష్కారం కనుగొనాలని అంతర్జాతీయ సమాజం ఎదురుచూస్తోంది.