Sunita Williams: సునీతా విలియమ్స్ అంతరిక్షంలో జుట్టు ఎందుకు విరబోసుకుంది?

ప్రస్తుతం ఎక్కడ చూసినా వ్యోమగామి సునితా విలియమ్స్ పేరు మారుమోగుతోంది. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో దాదాపు 9 నెలలు గడిపి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. అయితే ఆమె స్పేస్ లో ఉన్నప్పుడు జుట్టు విరబోసుకుని ఉన్న చాలా ఫోటోలు బయటకు వచ్చాయి. చాలామందికి ఆమె జుట్టు ఎందుకు ముడివేసుకోలేదనే డౌట్ ఉంది. ఒకసారి క్లియర్ చేసుకుందాం పదండి.

Sunita Williams Hair in Space: Why She Didn't Tie It Up in telugu KVG

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు 9 నెలలు అంతరిక్షంలో గడిపి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. కేవలం 8 రోజుల మిషన్ మీద వెళ్లిన సునీతా.. స్పేస్ షిప్ సాంకేతిక లోపాల కారణంగా ఇన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు.

సునితా విలియమ్స్ జుట్టు ఎందుకు వేసుకోలేదు?

సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆమె జుట్టు విరబోసుకొని ఉన్న చాలా ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే ఆమె జుట్టు ఎందుకు ముడి వేసుకోలేదనే ప్రశ్న చాలామందిలో తలెత్తింది. ఆమె జుట్టు అలా వదులుగా ఉంచుకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సునీతా విలియమ్స్ జుట్టుపై ట్రంప్ వ్యాఖ్యలు

Latest Videos

అంతరిక్ష కేంద్రంలో వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎప్పుడూ వదులు జుట్టుతోనే కనబడేవారు. ఆమె జుట్టు గాలిలో ఎగురుతున్నట్టుగా కనిపించేది. సునీత జుట్టుపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు కూడా చేశాడు. "సునీతా విలియమ్స్ జుట్టు విరబోసుకోవడాన్ని చూస్తేనే తెలుస్తోంది తనేంత ధైర్యవంతురాలో అని". ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఆమె ఎందుకు జుట్టు అలా విరబోసుకుందనే ప్రశ్న మాత్రం అందరిలో తలెత్తింది. అసలు ఎందుకు ఆమె జుట్టు ముడివేసుకోలేదు? దాని వెనక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గురుత్వాకర్షణ శక్తి

అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అంటే సాధారణంగా జుట్టుతో వచ్చే సమస్యలు అంతరిక్షంలో పెద్దగా ఉండవు. భూమిపై, గురుత్వాకర్షణ శక్తి జుట్టును కిందికి లాగుతుంది. దీనివల్ల జుట్టు కిందికి వాలిపోయి చిక్కుబడుతుంది. కానీ అంతరిక్షంలో జుట్టు ఎలాంటి సమస్య లేకుండా తేలియాడుతుంది.

వ్యోమగాములు పనిచేసేటప్పుడు జుట్టు కళ్లలో పడుతుందని చింతించాల్సిన అవసరం లేదు. అంతరిక్షంలో జుట్టు కళ్ళను కప్పివేయదు. కాబట్టి జుట్టును కట్టాల్సిన అవసరం లేదు. గురుత్వాకర్షణ శక్తి లేని కారణంగా జుట్టు చిక్కుబడే లేదా ముడిపడే ప్రమాదం కూడా లేదు.

భూమిపై జుట్టు చిక్కులు పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు తల దువ్వుకోవాలి. కానీ అంతరిక్షంలో అలా చేయాల్సిన అవసరం లేదు. అక్కడ జుట్టు గాలిలో తేలుతూ ఉండటం వల్ల చిక్కులు పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతరిక్షంలోని పరిస్థితుల్లో ఎవరైనా నెలల తరబడి జుట్టును దువ్వుకోకుండా ఉండొచ్చు.

vuukle one pixel image
click me!