Sunita Williams: సునీతా విలియమ్స్‌కి డాల్ఫిన్లు ఎలా స్వాగతం పలికాయో చూశారా.? సూపర్‌ వీడియో.

ఫ్లోరిడా తీరంలో వ్యోమగాములతో కూడిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ సముద్రంలో దిగగానే డాల్ఫిన్లు స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. 

NASA Astronauts Sunita Williams and Butch Wilmore Return Home Welcomed by Dolphins in telugu

అనుకోని విధంగా తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన తర్వాత, నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చివరకు బుధవారం భూమికి తిరిగి వచ్చారు. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మిషన్.

బుచ్ విల్మోర్, సునీ విలియమ్స్‌తో పాటు అమెరికన్ నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లను మోసుకెళ్తున్న స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌక భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 3 గంటల సమయంలో ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. 

Latest Videos

భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో 2,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుని నిలిచిన ఫ్రీడమ్ అనే వ్యోమనౌక సముద్రంలో అలలపై తేలుతుండగా సిబ్బంది ఆనందంతో కేరింతలు కొట్టారు.

తక్షణ భద్రతా తనిఖీల కోసం ఫాస్ట్ బోట్లు క్యాప్సూల్ వద్దకు చేరుకున్నాయి. ఆ తర్వాత రికవరీ నౌక సిబ్బందిని హ్యూస్టన్‌కు తరలించి, 45 రోజుల పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది.

"ఇదొక అద్భుతమైన ప్రయాణం - ఇక్కడ స్నేహితులతో నిండిన క్యాప్సూల్‌ను చూస్తున్నాను" అని హేగ్ అన్నాడు.

మిగిలిన సిబ్బందికి వీడ్కోలు చెప్పి, కౌగిలించుకున్న తర్వాత దాదాపు 17 గంటల ముందు ఈ నలుగురు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరారు.

నాసా వ్యోమగాములకు డాల్ఫిన్ల స్వాగతం

how kool is this dolphins around the capsule . pic.twitter.com/5u8t6st9yd

— Big Red (@tamalon)

ఫ్లోరిడా తీరంలో వ్యోమగాములతో కూడిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ సముద్రంలో దిగగానే డాల్ఫిన్లు స్వాగతం పలికాయి. ఆ సమయంలో డాల్ఫిన్లు వ్యోమనౌక చుట్టూ తిరుగుతూ కనిపించాయి.

A pod of dolphins curious about our Crew 9 astronauts on Dragon in Tampa Bay pic.twitter.com/khRp1YTWKW

— Sassy, Classy, Bit Smarta*sy🧜‍♀️ (@JustMe49213718)

 

Seeing the dolphins trying to help the Dragon capsule after it landed is pretty cool. pic.twitter.com/hTnA56fiqa

— B.P. Cox (@BPCox_)

 

Dolphins swimming around the capsule 🐬🐬🐬pic.twitter.com/8DzP0SAf0n

— JustJamie (@OYourNameHereO)

 

Special envoy of Israeli dolphins assisting the Dragon
🤭✌️ pic.twitter.com/6KSwkjIXNn

— miha schwartzenberg (@mihaschw)

రికవరీ బృందాలు సిబ్బందిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుండగా సముద్రపు జంతువులు క్యాప్సూల్‌ను చుట్టుముట్టిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి.

Dolphins welcoming Dragon and Crew-9 back home 😍🐬 pic.twitter.com/Uy590RrOM1

— Nuit Moore (@NuitMoore)

 

Dolphins breach exclusion zone. pic.twitter.com/phQD95S15J

— Nirgal451 🇦🇺🇺🇦 (@Nirgal451)

అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్న వ్యోమగాములకు ఈ దృశ్యాలు ఊహించని అనుభూతిని అందించాయి. 

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలల అంతరిక్ష యాత్ర

ఇద్దరూ మాజీ నేవీ పైలట్లు, అంతకు ముందు రెండు అంతరిక్ష యాత్రల్లో పాల్గొన్న అనుభవం ఉన్న విల్మోర్, విలియమ్స్ గత ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్‌ లో కొన్ని రోజుల పర్యటన కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.

కానీ వ్యోమనౌకలో సమస్యలు రావడంతో వారిని తిరిగి తీసుకురావడం కష్టమని పరిశోధకులు తేల్చారు. దీంతో అది ఖాళీగానే భూమిపైకి తిరిగి వచ్చింది.

తర్వాత వారిని నాసా స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్‌కు మార్చారు. ఇది గత సెప్టెంబర్‌లో ఇద్దరు సిబ్బందితో (సాధారణంగా నలుగురికి బదులుగా) ISSకి చేరుకుంది. 

కాగా క్రూ-10 అనే సహాయక బృందం స్టేషన్‌కు చేరుకుంది. దీంతో క్రూ-9 బృందం బయలుదేరడానికి మార్గం సుగమమైంది.

విల్మోర్, విలియమ్స్ 286 రోజుల పాటు ఉండటం సాధారణంగా ఆరు నెలల ISS రొటేషన్ కంటే ఎక్కువ. కానీ ఒకే మిషన్‌లో అమెరికా రికార్డుల్లో ఇది ఆరో స్థానంలో ఉంది.

ఫ్రాంక్ రూబియో 2023లో 371 రోజులతో అగ్రస్థానంలో ఉండగా, రష్యన్ వ్యోమగామి వాలెరి పోల్యాకోవ్ 437 రోజులు మిర్ స్టేషన్‌లో గడిపిన ప్రపంచ రికార్డును కలిగి ఉన్నారు.

బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లోని సెంటర్ ఫర్ స్పేస్ మెడిసిన్‌కు చెందిన రిహానా బొఖారీ ప్రకారం ఇది ఆరోగ్యపరంగా సాధారణమైన విషయమే.

కండరాలు, ఎముకల నష్టం, మూత్రపిండాల్లో రాళ్లు, దృష్టి సమస్యలకు దారితీసే ద్రవ మార్పులు, గురుత్వాకర్షణ వాతావరణానికి తిరిగి వచ్చిన తర్వాత సమతుల్యతను సరిచేయడం వంటి సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించవచ్చు.

"సునీత విలియమ్స్ వ్యాయామంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆమె సాధారణంగా చేసే దానికంటే ఎక్కువ వ్యాయామం చేస్తారని నేను నమ్ముతున్నాను" అని బొఖారీ AFPతో అన్నారు.

అయినప్పటికీ, వారి కుటుంబాలకు దూరంగా, తగినంత సామాగ్రి లేకుండా వారి బస ఎక్కువ కాలం కొనసాగడం ప్రజల దృష్టిని ఆకర్షించింది.

"మీరు ఈరోజు పనికి వెళ్లి, వచ్చే తొమ్మిది నెలల పాటు మీ ఆఫీసులో చిక్కుకుపోతారని తెలిస్తే, మీరు..మీ కుటుంబ సభ్యులు ఎంత భయపడుతారో ప్రత్యేకంగా చెప్పాలా" అని ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్శిటీలోని సైకాలజిస్ట్ జోసెఫ్ కీబ్లర్ AFPతో అన్నారు.

(AFP ఇన్పుట్‌లతో)

vuukle one pixel image
click me!