Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ మాట వినకుంటే ఇక బాంబు దాడులేనని హెచ్చరించారు.
Donald Trump, Nuclear Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. టెహ్రాన్ కొత్త న్యూక్లియర్ ఒప్పందానికి ఒప్పుకోకుంటే బాంబులేస్తామని లేదంటే సెకండరీ టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ... న్యూక్లియర్ డీల్ చేసుకోకుంటే బాంబులేస్తా. నాలుగు సంవత్సరాల కింద చేసినట్టు సెకండరీ టారిఫ్‌లు కూడా విధించొచ్చు అని స్పష్టం చేసారు.
ట్రంప్ వార్నింగ్‌పై ఇరాన్ డైరెక్ట్‌గా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చి ట్రంప్ లెటర్‌కు ఒమన్ ద్వారా రిప్లై పంపామని చెప్పారు. ఇరాన్ సీక్రెట్‌గా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి ట్రై చేస్తుందని వెస్ట్రన్ కంట్రీస్ ఆరోపిస్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం న్యూక్లియర్ ప్రోగ్రామ్ సివిల్ ఎనర్జీ కోసం మాత్రమే అని చెబుతోంది.
2015లో ఇరాన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, బ్రిటన్, అమెరికాతో న్యూక్లియర్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను లిమిట్ చేస్తే, దానిపై ఉన్న ఎకనామిక్ ఆంక్షలను తీసేయాలి. కానీ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 2018లో ఈ ఒప్పందం నుంచి అమెరికాను విడదీశారు. ఆ తర్వాత ఇరాన్‌ను మళ్లీ చర్చలకు తీసుకురావడానికి 'మాగ్జిమమ్ ప్రెజర్' పాలసీని ఫాలో అయ్యారు. ఇరాన్ ఎకానమీని ఎఫెక్ట్ చేయడానికి ఆంక్షలు మళ్లీ పెట్టారు.
ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీస్, బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్, రీజనల్ ఎఫెక్ట్‌ను ఆపడానికి ఆ కండీషన్స్ సరిపోవని అమెరికా చెప్పింది. అమెరికా ఆంక్షలు పెట్టిన తర్వాత ఇరాన్ కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండి యురేనియం నిల్వలను పెంచడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మళ్లీ ట్రంప్ పవర్ లోకి వచ్చాక ఇరాన్, అమెరికా రిలేషన్స్ మళ్లీ టెన్షన్‌గా మారాయి.
అయితే అమెరికా బెదిరింపులకు భయపడేది లేదంటూ ఇరాన్ కూడా ఎదురుదాడికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అక్కడి మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ సైన్యం మిస్సైల్స్‌ను లాంచ్ చేయడానికి రెడీగా పెట్టిందట. అన్ని భూగర్భ స్థావరాల్లో మిస్సైల్స్ లాంచర్లపై లోడ్ చేశామని, ఎప్పుడైనా పేల్చొచ్చని ఇరాన్ సైన్యం ఎక్స్ పోస్ట్‌లో ప్రకటించింది.