Trump: హార్వర్డ్‌ పై పోరాటంలో విజయం నాదే అంటున్న అమెరికా అధ్యక్షుడు!

Published : May 27, 2025, 09:42 AM ISTUpdated : May 27, 2025, 10:01 AM IST
Harvard University DHS 72 Hours Deadline

సారాంశం

హార్వర్డ్‌కు నిధులు ఆపేందుకు ట్రంప్‌ యత్నం, విదేశీ విద్యార్థుల జాబితా కోరడంతో  వివాదం మరింత ముదురుతోంది.

అమెరికాలో ప్రముఖ విద్యాసంస్థ హార్వర్డ్‌ యూనివర్సిటీతో  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ట్రంప్‌ తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్‌ సోషల్‌లో హార్వర్డ్‌కు దక్కాల్సిన మూడు బిలియన్ డాలర్ల ప్రభుత్వ సహాయాన్ని ఆపే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా నిధులను ట్రేడ్‌ స్కూల్స్‌కు మళ్లించాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇది దేశానికి ఉపయుక్తంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, హార్వర్డ్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థుల పూర్తి వివరాలు తమకు ఇప్పటివరకు అందలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఆ జాబితా ద్వారా దేశ భద్రతకు ముప్పు కలిగించే వారెవరైనా ఉన్నారా అనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో అమెరికా భద్రత కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేశామని, అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేందుకు ఇప్పటి నిర్ణయాలు అవసరమని అన్నారు. విదేశీయుల ప్రవేశంపై నియంత్రణ తీసుకురావాలన్నదే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు.

వీసా అనుమతులపై..

ఇది మొదటి వివాదం కాదు. ఇటీవల ట్రంప్‌ ప్రభుత్వం హార్వర్డ్‌కు ఇచ్చే కొన్ని నిధులను తగ్గించగా, అంతే కాకుండా విదేశీ విద్యార్థులపై విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ హార్వర్డ్ కోర్టును ఆశ్రయించింది. విదేశీ విద్యార్థుల వీసా అనుమతులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నైతికతకు, చట్టాలకు విరుద్ధమని హార్వర్డ్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఫెడరల్‌ కోర్టు, తాత్కాలికంగా ట్రంప్‌ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే ట్రంప్ మాత్రం విదేశీ విద్యార్థులు చదివే సమయంలో వారి దేశాలు ఎలాంటి ఖర్చు భరించడంలేదని వ్యాఖ్యానిస్తూ, హార్వర్డ్‌పై తన ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలను మరింత బలపరిచారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో ఉన్న ప్రఖ్యాత విద్యాసంస్థల మీద ప్రభుత్వ  హాస్తం పై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి.

హార్వర్డ్‌ యూనివర్సిటీ భవిష్యత్తులో ఎలా స్పందించనుందో చూడాలి. ప్రస్తుతం ఈ వివాదం విద్యా, రాజకీయ రంగాల్లో వేడి రాజేస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే