ఇండియన్‌ మెయిల్స్‌ అన్ని స్పామ్‌ నే...Newzealand ఇమ్మిగ్రేషన్ మంత్రి కీలక వ్యాఖ్యలు!

Published : May 27, 2025, 06:43 AM ISTUpdated : May 27, 2025, 11:08 AM IST
ఇండియన్‌ మెయిల్స్‌ అన్ని స్పామ్‌ నే...Newzealand ఇమ్మిగ్రేషన్ మంత్రి కీలక వ్యాఖ్యలు!

సారాంశం

ఇమ్మిగ్రేషన్ గురించి ఇండియన్లు పంపే మెయిల్స్ స్పామ్ లాగే చూస్తానని, అసలు ఓపెన్ చేయనని న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ చెప్పారు. దీనిపై న్యూజిలాండ్ ఇండియన్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ మండిపడ్డారు.

న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదానికి దారితీశాయి. పార్లమెంట్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, భారతీయులు ఇమ్మిగ్రేషన్ గురించి పంపే మెయిల్స్‌నే తాను ఓపెన్ చేయనని, అవన్నీ త‌న‌కు స్పామ్‌లా అనిపిస్తాయ‌ని పేర్కొన్నారు.ఆమె వ్యాఖ్యల సారాంశం ప్రకారం, భారతీయుల నుంచి భారీగా మెయిల్స్ వస్తున్నాయని, అవన్నీ సలహాలు, అభ్యర్థనలతో నిండిపోయి ఉంటాయని చెప్పారు. అయితే, ఆమె ఈ మెయిల్స్‌ని ఓపెన్ చేయడం లేదని, ఏకంగా వాటిని చదవకుండా వదిలేస్తానని వెల్లడించారు.

అంతే కాకుండా, ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక మెయిల్స్‌ని తాను తన వ్యక్తిగత మెయిల్‌కు ఫార్వర్డ్ చేసుకొని అక్కడే చూసుకుంటానని ఆమె చెప్పిన దానికీ ఇప్పటికే విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

ఈ అంశంపై న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యురాలు, భారతీయ మూలాలున్న ప్రియాంక రాధాకృష్ణన్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ, మంత్రిగా ఉండి కూడా ఈ విధంగా ఆలోచించకుండా మాట్లాడడం బాధాకరమని చెప్పారు. ఒక్క రీజియన్ నుంచి వచ్చే ప్రజలపై ఈ విధంగా అభిప్రాయం ఉండటం సరైంది కాదని, ఇది ప్రత్యక్షంగా కించపరిచేలా ఉందని ఆమె విమర్శించారు.

ప్రజల అభ్యర్థనలపై స్పందించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు రావడం అసహనానికి కారణమవుతోంది. న్యూజిలాండ్‌లో భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్న నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు వారు ఎదుర్కొంటున్న ఇమ్మిగ్రేషన్ సమస్యలను పట్టించుకోకపోవడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక సమాచారం పట్ల బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా స్పందించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇమిగ్రేషన్ సేవలపై ప్రజలు తమ సందేహాలు లేదా అవసరాల కోసం మెయిల్స్ పంపించటం సహజం. అలాంటప్పుడు అటు అధికారికంగా, ఇటు మానవీయంగా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రతినిధులపై ఉంటుంది. అయితే, ఇక్కడ మంత్రివర్యులు చూపిన వ్యవహారం అందుకు విరుద్ధంగా ఉంది.

ఈ వివాదం ఎటు దారితీస్తుందనేది చూడాలి గాని, భారత్ మూలాలున్న ప్రజల మనోభావాలను గాయపర్చిన ఈ వ్యాఖ్యలపై అధికారిక వివరణ అవసరం అనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే